కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. భారత్ పై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సాధారణ ప్రజలతో పాటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. అలాగే ఈ మహమ్మారి సోకి ఇప్పటికే అనేకమంది మరణించగా.. మరికొందరు కొలకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా.. జార్ఖండ్ వ్యవసాయశాఖ మంత్రి బాదల్ పత్రలేఖ్ కరోనా బారినపడ్డారు.
దీంతో గత కొన్నిరోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని ట్విటర్‌లో కోరారు. అయితే కరోనా లక్షణాలున్నప్పటికీ జార్ఖండ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బన్న గుప్తా మంగళవారం (ఆగస్టు 19న)న జరిగిన మంత్రిమండలి సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు.
Jharkhand Agriculture Minister Badal Patralekh says, he has tested positive for #COVID19 pic.twitter.com/edh95W48jA
— ANI (@ANI) August 23, 2020