ఏడుకొండల శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తలకు టీటీడీ కీలక విషయాన్ని వెల్లడించింది. తిరుమలలో సాధారణ రద్దీ కొనసాగుతుంది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు. అయితే.. రేపటి నుండి తిరుమలలో శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం రానున్నాయి. ఉత్సవాల కోసం అంతా సిద్ధం చేసింది టీటీడీ. అయితే.. ఆదివారం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని టీటీడీ తెలిపింది. సోమవారం నుంచి మూడు రోజుల పాటూ వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయని టీటీడీ వెల్లడించింది. ఈ నెల 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. 7న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. శ్రీవారి పవిత్రోత్సవాల్లో భాగంగా 8న పవిత్రాల ప్రతిష్ట, 9న పవిత్ర సమర్ఫణ. 10న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడురోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేక అలంకరణలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇస్తారు.
8న పవిత్రాల ప్రతిష్ట, 9న పవిత్ర సమర్పణ, 10న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల సందర్భంగా సోమవారం నుంచి మూడు రోజుల పాటూ ఆర్జిత సేవలు రద్దు చేశారు టీటీడీ అధికారులు. అలాగే పవిత్రోత్సవాలకు టికెట్లు పొందిన భక్తులు మూడు రోజులు స్నపన తిరుమంజనంలో, చివరి రోజు పూర్ణాహుతిలో పాల్గొనవచ్చు. పవిత్రోత్సవాల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ వస్త్రధారణలో ఉదయం 7 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1 వద్దకు చేరుకోవాలి. టికెట్‌తోపాటు ఏదైనా ఒక ఒరిజి నల్ ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది టీటీడీ.