సెక్స్ అంటే ఓ బూతు పదంలో చూసే రోజుల నుంచి ఇది కూడా జీవితంలో భాగమనే రోజుల్లోకి వచ్చాము. దాంపత్య జీవితం సజావుగా సాగాలన్నా.. దంపతుల మధ్య బంధం మరింత బలపడాలన్నా శృంగారం అనేది కీలకమని నిపుణులు చెబుతున్నారు. శృంగారం చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా అనేక లాభాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
సెక్స్ లో పాల్గొని చాలా రోజులు అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలింది. శృంగారం పాల్గొని చాలా రోజులు అయితే.. అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వారంలో 2 సార్లు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు సెక్స్ చేసేవారిలో కన్నా తక్కువ సెక్స్ చేసేవారిలో గుండె జబ్బులు అధికమని పరిశోధనల్లో తేలింది. శృంగారంలో పాల్గొనడం వల్ల ఒత్తడిని కలిగించే హర్మోన్లు తగ్గిపోయి.. యాంగ్జైటీ దూరం అవుతుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. శృంగారం తక్కువ అయితే రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, నిద్ర లేమి సమస్యలు వేధిస్తాయని తేలింది.