ఇండియాను ఓమిక్రాన్ కేసులు భయపెడుతున్నాయి. రోజు రోజు కొత్త కేసులు నమోదవుతున్నాయి. దక్షిణాఫ్రికా, జిబాంబ్వే నుంచి వచ్చి వారికి ఓమిక్రాన్ కేసులు వస్తున్నాయి. ఇప్పటికే దేశంలో 4 కేసులు నమోదవ్వగా… ఢిల్లీ ఆదివారం మరో కేసు నమోదైంది. ఇప్పటి వరకు దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 5కు చేరింది. ఇప్పటికే బెంగళూర్ లో 2 ఓమిక్రాన్ కేసులు నమోదవ్వగా… గుజరాత్ లో జింబాబ్వే నుంచి వచ్చిన ఓ వ్యక్తికి, ముంబైకి దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి ఓమిక్రాన్ వేరియంట్ కరోనా సోకింది. తాజాగా టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ వ్యక్తికి ఓమిక్రాన్ వేరియంట్ సోకింది. దీంతో దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 5కు పెరిగింది.
ప్రస్తుతం వీరంతా ఎంతమందిని కలిశారు.. వారిలో ఎంతమందికి కరోనా సోకిందో తెలుసుకుని వారి శాంపిళ్లను జీనోమ్ సిక్వెన్సింగ్ కోసం ల్యాబుకు పంపారు. అయితే వీటి ఫలితాలు వస్తే మరెంత మందికి ఓమిక్రాన్ సోకిందో తెలుస్తుంది. ఓమిక్రాన్ నేపథ్యంలో ఎయిర్ పోర్టుల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలను తప్పని సరి చేస్తున్నారు. ఒకవేళ కరోనా పాజిటివ్ వస్తే వారిని ఐసోలేషన్ కు తరలిస్తున్నారు. వీరికి ఏ వేరియంట్ సోకందో అని జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిస్తున్నారు. దీని ద్వారా వారికి ఓమిక్రాన్ వేరియంట్ సోకిందా..? లేక డెల్టానా.. మరేదైనా వేరియంట్ సోకిందో తెలుస్తుంది.