కేరళ: భార్య, భర్తల వైవాహిక సంబంధాలపై కేరళ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్యకు ఇష్టం లేకుండా భర్త సెక్స్ చేస్తే అది అత్యాచారం కిందకే వస్తుందని కోర్టు తేల్చి చెప్పింది. భర్త క్రూరత్వం విడాకులకు దారి తీస్తోందని పేర్కొంది. ఓ భార్య వేసిన కేసుకు సంబంధించి కేరళ హైకోర్టు శుక్రవారం విచారించింది. తన అనుమతి లేకుండా భర్త సెక్స్ చేశాడని, తన పట్ల క్రూరత్వంగా ప్రవర్తించాడని, తనకు విడాకులు కావాలని కోర్టుకు భార్య విజ్ఞప్తి చేసింది.
దీంతో విడాకులు మంజూరు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ వేసిన భర్త పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టిపారేశింది. భర్త క్రూరత్వం .. భార్య విడుకులు కోరే వరకూ వెళ్లిందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇష్టం లేకుండా నిర్భంధ సెక్స్ చేసినట్లు భావించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. నైతికత, క్రమశిక్షణరాహిత్యం, పోకిరి తనంతో కూడిన సెక్స్‌ను సాధారణ దాంపత్య జీవితంగా పరిగణననలోకి తీసుకోలేమని, అందువల్ల భార్య విడాకులు కోరితే తప్పనిసరిగా మంజూరు చేయాల్సి ఉంటుందని కోర్టు వెల్లడించింది.