ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతం, పుణ్య క్షేత్రం శబరిమలలో ఒక్కసారిగా కలకలం రేగింది. శబరిమల ఆలయానికి వెళ్లే మార్గంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడం సంచలనం రేకెత్తించింది. దీంతో పోలీసులు, ఆలయ అధికారులు అలెర్ట్ అయ్యారు. శబరిమల ఆలయానికి వెళ్లే మార్గంలో పెన్ ఘాట్ వంతెన కింద జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు భద్రతా అధికారులు. అసలు ఇవి ఎక్కడ నుంచి వచ్చాయి.. ఎవరు తీసుకువచ్చారనే దానిపై విచారణ జరుగుతోంది. మొత్తంగా 6 జిలెటిన్ స్టిక్స్ లను స్వాధీనం చేసుకున్నారు. బాంబ్ స్వ్యాడ్ మొత్తం తనిఖీలు చేస్తున్నారు.
అయితే ఇదే మార్గంలో స్వామి వారి బంగారు ఆభరణాలు తీసుకువస్తుంటారు. దీంతో తిరువాభరణాలు, పాత్ ప్రొటెక్షన్ కమిటీ ప్రెసిడెంట్, సెక్రటరీ ప్రసాద్ పుజిక్కల్ ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని కోరారు. ప్రముఖ పుణ్య క్షేత్రం శబరిమలలో ఇటాంటి ఘటన చోటు చేసుకోవడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది.