అమీర్ ఖాన్ ని వెనక్కి నెట్టిన షారుక్ ఖాన్

-

ఎన్నో రోజులకి మళ్లీ బాలీవుడ్ లో నూతన ఉత్తేజాన్ని తీసుకువచ్చిన సినిమా ‘పఠాన్’ అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. గత నాలుగేళ్లలో బాలీవుడ్ లో ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అగ్ర కథానాయకులందరూ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిపోయారు. ఇదిలా ఉండగా 2023 జనవరి 25న విడుదలైన షారుక్ ఖాన్ ‘పఠాన్’ బాలీవుడ్ కి నూతన జీవాన్ని ఇచ్చింది. విడుదలైన వారంలోనే 500 కోట్ల వసూళ్లు రాబట్టి… సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్ లో బడా సినిమాల పేరిట ఉన్న రికార్డులను ఒక్కొక్కటిగా చెరిపేసి తన పేరుని సువర్ణ అక్షరాలతో లిఖించుకుంటుంది.

యాక్షన్ చిత్రాలు తీయడంలో రాటుదేలిన దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ పఠాన్ సినిమాని తెరకెక్కించి షారుక్ ఖాన్ కి ఊహించని విజయాన్ని అందించారు. ఎన్నో సంవత్సరాలుగా తన ఫ్యాన్స్ కి అనుకున్న స్థాయిలో హిట్ సినిమా ఇవ్వలేక పోతున్నానని సతమతమవుతున్న షారుక్ కి సిద్దార్థ్ పఠాన్ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ ని అందించారు. దీంతో షారుక్ ఫ్యాన్స్ ఆకాశమే హద్దుగా కలెక్షన్ల సునామీని కురిపిస్తున్నారు. విడుదలైన 13 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా పఠాన్ సినిమా 850 కోట్లు కలెక్ట్ చేసింది.  దీన్ని బట్టి షారుక్ ఫ్యాన్స్ ఎంత దాహంతో ఉన్నారో మనకి అర్థమవుతుంది.

హిందీ సినిమా చరిత్రలోనే ‘పఠాన్’ అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా తన పేరిట సరికొత్త రికార్డు సృష్టించింది. ఇంతక ముందు అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ పేరిట ఉన్న అత్యధిక వసూళ్ల రికార్డ్ ని పఠాన్ అతి తక్కువ రోజుల్లోనే చెరిపేసింది. దీంతో ఫ్యాన్స్ అమీర్ ఖాన్ ని షారుక్ వెనక్కి నెట్టేశారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఈ ‘పఠాన్ మేనియా’ ఇలానే కొనసాగితే మరికొద్ది రోజుల్లో షారుక్ 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం.

 

Read more RELATED
Recommended to you

Latest news