Shahrukh Khan : షారుఖ్ ఖాన్ వాచ్ మరీ అంత ఖరీదా..?

-

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ధరించిన ఒక వాచ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ రచ్చ నడుస్తోంది. ఆయన ధరించిన వాచ్ ఖరీదు చాలా ఎక్కువ అంటూ కొంతమంది నెటిజన్లు  చర్చించుకుంటున్నారు. దాదాపు ఆ వాచ్ నాలుగు కోట్ల 75 లక్షలు అంటూ సదరు ట్విట్టర్ యూజర్ పేర్కొనడంతో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.

షారుఖ్ తరచుగా వివిధ సందర్భాలలో ఆడెమర్స్ పిగ్యెట్ వాచ్ ధరించి కనిపిస్తూ వస్తున్నాడు. బ్లూ సిరామిక్ ఏపీ పర్మనెంట్ క్యాలెండర్ వాచ్ని ధరించి ఉన్న తాజా చిత్రాన్ని మంగళవారం షారుక్ ఖాన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

ఈ ఫోటోలో షారుఖ్ ధరించిన వాచ్ 4.75 కోట్ల రూపాయలు అని ఒక ట్విట్టర్ యూజర్ పేర్కొన్నారు.  ఈ వాచ్ సంవత్సరం ఆగస్టులో విడుదలైంది. ఇక లగ్జరీ వాచెస్ USA అనే వెబ్సైట్ ప్రకారం ప్రత్యేకమైన లగ్జరీ వాచ్ వాస్తవానికి దాదాపు రూ. 4.9 కోట్లు ($600000)గా ఉంది.  ఇది ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాచెస్లో ఒకటిగా పరిగణించబడుతుంది.

ఈ వాచ్లో చిన్న ముల్లు పెద్ద ముల్లులపై 18 క్యారెట్ల బంగారం తాపడం చేసి ఉంది.  దీనిపై ఓ అభిమాని స్పందిస్తూ ఇది సమయాన్ని చూపించడంతో పాటు ఒకవేళ భవిష్యత్తును చెబుతుందా?’ అని ఆశ్చర్యపోతూ కామెంట్ చేశాడు. ఏదేమైనా అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ వాచ్ అమ్మితే ఒక బ్యాచ్ జీవితాలు సెటిలైపోయినట్లు ఈ వాచ్ కూడా అమ్మితే చాలామంది జీవితాలు సెటిలైపోవడం ఖాయం.

Read more RELATED
Recommended to you

Latest news