బాబోయ్ విడుదలకు ముందే రికార్డు సృష్టిస్తున్న షారుక్ పఠాన్..!

-

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించి.. ఆయన రికార్డుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే ఆయన ఒక సాలిడ్ కమర్షియల్ సక్సెస్ అందుకొని ఏకంగా దశాబ్ద కాలం పూర్తయింది అని చెప్పవచ్చు. అయినా కూడా ఆయన క్రేజ్.. స్టార్డం.. ఏమాత్రం ఎక్కడ తగ్గలేదు.. ఇకపోతే ఈయన నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ప్రేక్షకులు ఆయన తాజా చిత్రం పఠాన్ పై భారీ అంచనాలు పెట్టుకోవడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇకపోతే సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న అతిపెద్ద యాక్షన్ ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే షారుక్ ఖాన్ యొక్క గత సినిమాల ఫలితాలు అలాగే ఇతర సినిమాల నేపథ్యంలో పఠాన్ ఓపెనింగ్ ఎలా ఉంటాయో అనే అనుమానాలు కూడా అందరిలో వ్యక్తమయ్యాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. విడుదలకు ముందే ఈ సినిమా రికార్డు సృష్టించిందని తెలుస్తోంది. విడుదల రోజు వరకు ఏకంగా ఐదు లక్షల అడ్వాన్స్ బుకింగ్ నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇకపోతే ఈ సినిమా చుట్టూ నెలకొన్న వివాదాలు.. బాయికాట్ పిలుపు నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ ఆరంభం అవుతాయా? లేదా? అని అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేశారు. కానీ ఎప్పుడైతే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయో కొన్ని గంటల వ్యవధిలోనే రెండు లక్షల టికెట్లు బుక్ అవడం ఇప్పుడు సంచలన రికార్డు అని చెప్పవచ్చు. అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కాకుండానే ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ జరుగుతుంది అంటే ఇక మరో మూడు రోజుల్లో ఈ మార్క్ 5 లక్షల కంటే ఎక్కువ దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా విడుదలకు ముందే ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోబోతున్నారు షారుక్.

Read more RELATED
Recommended to you

Latest news