హైదరాబాద్ లో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ ..భారీ మొత్తంలో కొకైన్ స్వాధీనం !

Join Our Community
follow manalokam on social media

హైదరాబాద్ లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఎక్సైజ్ పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ లో ప్రముఖులకు, కొందరు ప్రముఖుల పుత్ర రత్నాలకు డ్రగ్ డీలర్ డాడీ బాయ్ డ్రగ్స్  పంపించినట్టు తేలింది. నాలుగేళ్ల క్రితం వరకు హైదరాబాద్ లో ఉండి డ్రగ్ బిజినెస్ నడిపిన  డాడీ బాయ్, గతం లో డ్రగ్స్ అమ్ముతూ హైదరాబాద్ టాస్క్ ఫోర్స్  పోలీసులకు దొరికాడు. దీంతో మకాం మార్చి గోవా , బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ ను హైదరాబాద్ పంపుతున్నాడు. అయితే 153  గ్రాముల కొకైన్ ని ఒకే సారి హైదరాబాద్ పంపి ఇక్కడ ప్రముఖలకు డ్రగ్స్ డెలివరీ చేయించే ప్లాన్ చేసినట్లు గుర్తించారు.

హైదరాబాద్ లో గుడ్ స్టఫ్ అంటూ వాట్సాప్ గ్రూప్ ద్వారా తతంగం నడిపి జేమ్స్ అనే నైజీరియన్ ద్వారా డ్రగ్స్ డెలివరీ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే నేరుగా ఫోన్ నెంబర్ ఇవ్వకుండా  వ్వాట్సాప్ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా  ఆపరేట్ చేస్తూ ప్రముఖ హోటల్స్ , నెక్లస్ రోడ్ , చెక్ పోస్ట్ , డ్రైవ్ ఇన్ లలో డెలివరీ ఇస్తున్నట్టు తేలింది. ప్రముఖుల పుత్రరత్నాలు ఓకే సారి బల్క్ ఆర్డర్స్ చేసిన నేపథ్యంలో ఈ  నెల 14న బస్సు ద్వారా హైదరాబాద్ కు డ్రగ్స్ చేరినట్టు చెబుతున్నారు. పక్కా సమాచారంతో డ్రగ్ డెలివరీ బాయ్ జేమ్స్ ను పట్టుకున్న ఎక్సైజ్  అధికారులు, బల్క్ ఆర్డర్ చేసిన ప్రముఖుల ఫై ఆరా తీస్తున్నారు. ఓకే సారి 153  గ్రాముల కొకైన్ , mdma  దొరకడం తో డ్రగ్స్ వ్యవహారం మీద ఎక్సైజ్ శాఖ సీరియస్ గా దృష్టి పెట్టింది. 

TOP STORIES

సంస్కృతం నేర్చుకోవాల‌నుకునే వారి కోసం.. కేంద్ర ప్ర‌భుత్వం కొత్త యాప్‌..!

సంస్కృతం భాష‌ను దైవ భాష అంటార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ భాష నుంచే అనేక భార‌తీయ భాష‌లు వ‌చ్చాయ‌ని నిపుణులు చెబుతుంటారు. అయితే ప్ర‌స్తుత...