సీఎం కేసీఆర్కు వైఎస్ షర్మిల సవాల్

-

దమ్ముంటే సిట్టింగులకే టిక్కెట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్కు వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ గెలిస్తే కేసీఆర్ పాలన బాగుంగదని తాను అనుకుంటానని అన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ఉద్యమ సెంటిమెంట్ తో మొదటిసారి సీఎం పీఠం ఎక్కిన కేసీఆర్.. రెండోసారి తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో మళ్లీ గెలిచారని అన్నారు. కానీ ఈ తొమ్మిదేండ్లలో ఇచ్చిన హామీలను కేసీఆర్ ఎగ్గొట్టారని అన్నారు.

YS Viveka Murder: YS Sharmila hints at 'political motive' behind his  uncle's murder

ఉద్యోగాల కల్పనపై దమ్ముంటే తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, ఉద్యోగాల పేరుతో గడిచిన తొమ్మిదేళ్లలో కాలయాపన చేసిన కేసీఆర్ ఈ సవాల్ స్వీకరించాలని షర్మిల డిమాండ్ చేశారు. ఇంటికో ఉద్యోగమని చెప్పి గద్దెనెక్కిన కేసీఆర్ నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష పోస్టులు భర్తీ చేస్తామని, ఆ తర్వాత 80 వేల పోస్టులు భర్తీ చేస్తామని మరోసారి మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ వచ్చిన ఈ తొమ్మిదేళ్ల కాలంలో భర్తీ చేసిన పోస్టులు కేవలం 58,240 మాత్రమేనని షర్మిల ధ్వజమెత్తారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news