గోదావరి ఉగ్రరూపం.. మొదటి హెచ్చరిక జారీ

-

భద్రాచలం వద్ద అంతకంతకు గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. భద్రాచలం దగ్గర 43.3 అడుగులకు చేరింది నీటిమట్టం. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. గత 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ రాష్ట్రాల నుంచి అధిక నీరు గోదావరికి చేరడంతో.. మరొక రెండు, మూడు అడుగుల వరకు సాయంత్రం లోపు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Floodwater starts receding in Godavari - The Pioneer

గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతుండటంతో కరకట్టపైకి ఎవరిని రానివ్వకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. లంక గ్రామ ప్రజలు కూడా అధికారులకు సహకరించి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్ ప్రియాంక అల సూచించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news