నీ కాల‌ర్ ప‌ట్టుడు ప‌క్కా..కేసీఆర్ కు ష‌ర్మిల వార్నింగ్..!

సీఎం కేసీఆర్ పై మ‌రోసారి వైఎస్ఆర్ తెలంగాణా పార్టీ అధినేత్రి ష‌ర్మిల నిప్పులు చెరిగారు. ఆగ్రహించిన రైతన్న చేతకాని సర్కార్ తీరుకు పంటను తగలబెట్టుకొంటుండు అంటూ మండిప‌డ్డారు. ఆత్మహత్య చేసుకుంటుండు రైత‌న్న అంటూ ఆవేద‌న వ్యక్తం చేశారు. దొరా..నువ్వు పంట కొననని రైతులతో కాళ్ళు మొక్కించుకున్నా,పంటను కొనకుండా రైతులతో పంటను తగలబెట్టేలా చేసినా,నువ్వు వడ్లు కొనకపోతే నీ కాలర్ పట్టుడు పక్కా అంటూ షర్మిల కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు.

Sharmila comments on cm kcr
Sharmila comments on cm kcr

నీ అధికారానికి నిప్పు పెట్టుడు పక్కా అంటూ ష‌ర్మిల కేసీఆర్ పై మండిప‌డ్డారు. తిరగబడ్డడు రైతన్న…వడ్లు కొన‌కుండా రైతు మీద సర్కారు పగపడుతుంటే, తరుగు పేరిట మిల్లర్లు దోచుకుంటుంటే, కొంటారో కొనరో తెలియక రైతు గుండెలు ఆగిపోతుంటే, ఎవడు చస్తే నాకేంటని సర్కారు చేతులెత్తేస్తే, కేసీఆర్ ధాన్యం కొనక రాజకీయాలు చేస్తుంటే..
తిరగబడ్డడు రైతన్న…అంటూ ష‌ర్మిల ప్రాస‌లో కేసీఆర్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.