స్వీట్లు తింటారు, కౌగిలించుకుంటారు…జగన్‌, కేసీఆర్‌ లపై షర్మిల ఫైర్‌

-

భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు వైఎస్ షర్మిల గారు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జగన్‌, కేసీఆర్‌ లపై షర్మిల ఫైర్‌ అయ్యారు. భద్రాచలం పట్టణానికి కరకట్ట ఎత్తు పెంచక పోవడమే వరదలకు కారణమని.. 8 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు కరకట్ట ఎత్తు పెంచలేదని ఆగ్రహించారు. తక్షణం కరకట్ట ఎత్తు పెంచాలని డిమాండ్ చేస్తున్నామని వెల్లడించారు.

వైఎస్సార్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం…తర్వాత కేసీఅర్ సైతం పట్టించుకోలేదని.. కేసీఅర్ కు భద్రాచలం మీద ఉన్న ప్రేమ ఏంటో అర్థం అవుతుందని చెప్పారు. ముంపునకు పక్క రాష్ట్రం లో ఉన్న పోలవరం కారణం అంటాడని.. పోలవరం కారణం అయితే ఇన్నేళ్ళు ఎందుకు మెచ్చుకున్నారని కేసీఆర్‌ ను నిలదీశారు.

ఇన్నేళ్ళు పోలవరం గురించి ఎందుకు మాట్లాడలేదు… పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని మీ ఇళ్లకు పిలుస్తారు… కౌగిలించుకున్నారు…స్వీట్ లు తినిపించారు కదా… అన్నాలు పెట్టుకున్నారు..అన్ని చేశారు…కానీ మాట్లాడుకోవడం తీరిక లేదా అని ఆగ్రహించారు. అప్పుడు కనిపించలేదా పోలవరం ప్రాజెక్ట్…. తప్పించుకోవడానికి కారణం ఎందుకు వెతుకు తున్నారని మండిపడ్డారు. భద్రాచలం వరదలు కారణం కేసీఆర్‌ నేనని స్పష్టం చేశారు వైఎస్ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news