రణవీర్ న్యూడ్ ఫోటోషూట్ పై సూటి ప్రశ్న వేసిన ప్రముఖ నటి.. స్పందిస్తారా..?

-

తాజాగా మ్యాగజైన్ కోసం ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అలాగే స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే భర్త రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ చేసి అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతే కాదు ఆయన ఇలా న్యూడ్ గా ఉండడానికి.. ఎంత మందిలో ఉన్నారు సిగ్గుపడను అంటూ చేసిన కామెంట్లు సర్వత్ర సంచలనంగా మారాయి. ఇకపోతే రణవీర్ సింగ్ సాధారణంగా ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా పరిచయం చేసుకోవడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా ఆయన స్టైల్ ను చాలా మంది అభిమానులు ఇష్టపడతారని చెప్పడంలో సందేహం లేదు. కానీ ఇలా ఒక్కసారిగా ఫ్యాషన్ లో పీక్స్ కి వెళ్ళిపోయిన ఆయన న్యూడ్ ఫోటోలు వదిలి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాడు.

ఇకపోతే రణవీర్ సింగ్ ఇలా స్టార్ హోదాలో ఉండి కూడా ఏమాత్రం సిగ్గు బిడియం లేకుండా ఇలా నగ్నంగా ఫోటోషూట్ లు చేస్తుంటే కొంతమంది ఈయనను అభినందిస్తున్నారు. కానీ మరి కొంతమంది మాత్రం ఎంత అబ్బాయి అయితే మాత్రం ఇలా నగ్నంగా ఫోటోలు దిగాలా అంటూ ఈయనపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు . అంతేకాదు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో దుమారం రేపడమే కాకుండా కొత్త వివాదాలకు దారితీస్తోంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా బెంగాలీ నటి, రాజకీయ నాయకురాలు మిమి చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక ఆమె మాట్లాడుతూ ఇదే నగ్న ఫోటోషూట్ ఒక స్త్రీ చేసి ఉంటే.. మీ నుంచి ఇదే స్పందన లభించేదా? అనే ప్రశ్నను ఆమె సందించడంతో చాలామంది ఈమెకు నెట్టింట సపోర్టుగా నిలుస్తున్నారు.

అమ్మాయిలు ఇలాంటి న్యూడ్ ఫోటో షూట్ చేస్తే.. ఆమెను కించపరిచే విధంగా దూషిస్తూ.. పరభాషలాడుతూ ఆ అమ్మాయిని మానసికంగా హింసిస్తారు.. కానీ అబ్బాయిని మాత్రం సమర్థిస్తారా? అంటూ ఈమె సూటిగా ప్రశ్నించింది. ఇక ప్రస్తుతం ఈమె చేసిన ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక దీనిపై ఎవరు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news