తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ సర్కార్ లపై మరోసారి వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ఈ చాత కానీ సీఎం మనకొద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి నాన బోస్తే పుచ్చి బుర్రెలైనట్టు.. ఈరోజు సర్కార్ రుణమాఫీ చేస్తుందని కేసీఆర్ గారిని నమ్మి గెలిపిస్తే.. రైతులను బ్యాంకర్ల దృష్టిలో దొంగల్ని చేశారని మండిపడ్డారు.
రుణం ఎగ్గొట్టే ఎగవేతదారులుగా చేశారని… చేసిన అప్పులకు వడ్డీ మీద వడ్డీ కట్టలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే దొరగారికి రుణమాఫీ చేస్తామని చెప్పిన హామీ మాత్రం గుర్తుకు రాదని ఓ రేంజ్ లో రెచ్చి పోయారు. లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మూడేండ్లు అయితున్నా.. ఇప్పటి వరకు మాఫీ చేసింది మాత్రం కేవలం 3 శాతం మాత్రమేనని నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిల. రైతు రుణమాఫీ ఎగ్గొట్టిన చేత కాని ముఖ్యమంత్రి మనకొద్దంటూ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలంతా.. సీఎం కేసీఆర్ కు బుద్ది చెప్పాలని పిలుపు నిచ్చారు.