భేడీలు వేయాల్సింది రైతులకు కాదు..కేసీఆర్ కుటుంబానికి – వైఎస్ షర్మిల

-

బేడీలు వేయాల్సింది రైతులకు కాదు..కేసీఆర్ కుటుంబానికి అని వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు భూములు త్యాగం చేసిన రైతులకు కేసీఆర్ సంకెళ్లు వేయించారని నిప్పులు చెరిగారు. పరిహారం అడిగితే లాఠీలతో కొట్టించారు. అన్నం పెట్టే రైతులు, మీకు రౌడీల్లా కనిపిస్తున్నారా? బేడీలు వేయాల్సింది రైతులకు కాదు.. రాష్ట్రాన్ని దోచుకుతింటున్న కేసీఆర్ కుటుంబానికి, భూములు గుంజుకుంటున్న టీఆర్ఎస్ నాయకులకు అని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.

కేసీఆర్ దిక్కుమాలిన పాలనలో కొత్త పెన్షన్ల జాడ లేదని… కౌలు రైతులకు సాయం లేదు. దళితులకు సాగు భూములు లేవు. నిరుద్యోగులకు కొలువులు లేవు. మహిళలకు రక్షణ లేదు. అవినీతికి అడ్డు లేదని నిప్పులు చెరిగారు.

రైతుబంధు గురించి గొప్ప‌లు చెప్పే కేసీఆర్.. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు మాత్రం ప్ర‌స్తావించ‌రు. ఎక‌రాకు ముష్టి రూ.5వేలు ఇచ్చి, రైతులు కోటీశ్వ‌రులయ్యార‌ని చెప్తున్నారు. అందుకేనా ఎనిమిదేండ్ల‌లో 8వేల మంది రైతుల ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంది? ఓట్లు వేసిన పాపానికి రైతులను నిండా ముంచాడని షర్మిల మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news