బతుకమ్మ ముసుగులో లిక్కర్ దందా చేసి, తెలంగాణ ఇజ్జత్ తీశావ్‌ – షర్మిల

-

బతుకమ్మ ముసుగులో లిక్కర్ దందా చేసి, తెలంగాణ ఇజ్జత్ తీశావ్‌ అంటూ కవితపై షర్మిల ఆగ్రహించారు. అమ్మ కవితమ్మ…అత్త మీది కోపం దుత్త మీద చూపినట్టు..
నీ బండారం బట్టబయలైతే, అవి మీడియా ప్రసారం చేస్తే.. పాత్రికేయులకు, మీడియా సంస్థలకు విలువలు లేవని మాట్లాడుతున్న నీకు.. ఏం విలువ ఉన్నట్లు? అని ఫైర్ అయ్యారు.

బతుకమ్మ ముసుగులో లిక్కర్ దందా చేసి, తెలంగాణ ఆడబిడ్డల ఇజ్జత్ తీసిన కవితమ్మ.. బురద చల్లడం అంటే ఏంటి జర చెప్పమ్మా.! లిక్కర్ స్కాంలో రోజుకో ఎపిసోడ్ బయట పడుతుంటే నిజాలు రాయకుండా.. లిక్కర్ స్కాంతో ఘనకార్యం చేశావని నెత్తిన పెట్టుకోవాలా? ఆహా! ఓహో అని వార్తలు రాయాలా? లిక్కర్ డాన్, లిక్కర్ క్వీన్ అంటూ బిరుదులు ఇయ్యమంటావా?అంటూ చురకలు అంటించారు. ఒక అనామకుడు ఆరోపణలు చేస్తే మీ నాన్న.. ఈటెల రాజేందర్ ను పార్టీలోంచి సస్పెండ్ చేశారు.

లిక్కర్ స్కాంకు పాల్పడ్డ నిన్ను, సస్పెండ్ చేయకుండా రాచమర్యాదలతో KCR ప్రగతి భవన్ లో స్వాగతం పలికారు. బిడ్డను కాపాడుకొనేందుకు ఢిల్లీ వీధుల్లో తిరిగారు. తోడుదొంగలంతా ఒక్కటైనట్లు మంత్రులంతా ఇరాం లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి పొగిడారన్నారు. నువ్వు నిజంగా అవినీతికి పాల్పడకపోతే నీ పదవికి రాజీనామా చేసి, తెలంగాణ ప్రజల ముందు నీ నిజాయతీని నిరూపించుకో. నువ్వు చేసిన తప్పుకు తెలంగాణ ప్రజలు నిలదీస్తారు కానీ ఎప్పటికీ తలవంచరు. చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి.. పనికిమాలిన పనులు అంటూ కవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news