అందుకే పూర్ణాతో ఐదు సినిమాలు చేశా- రవిబాబు..!!

-

ప్రముఖ కమెడియన్, డైరెక్టర్ , నిర్మాత రవిబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఇటీవల ఆయన నటించి దర్శకత్వం వహించిన చిత్రం అసలు.. నిన్న ఈటీవీ విన్ యాప్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా ఇందులో కూడా మళ్లీ ప్రొఫెసర్ పాత్రలో పూర్ణ కనిపించడంతో అనుమానాలకు మరింత ఆజ్యం పోసినట్టు అయింది. ఎందుకంటే రవిబాబు తెరకెక్కించే ఏ సినిమాలో అయినా సరే కచ్చితంగా పూర్ణ నటిస్తుంది. ఈ క్రమంలోనే ఆయన దర్శకత్వం వహించి నటించిన అవును , అవును 2 చిత్రాల ద్వారా పూర్ణ మరింత పాపులారిటీ దక్కించుకుంది.

ఈ సినిమాల ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఆ తర్వాత రవిబాబు ఎప్పుడు దర్శకత్వం వహించినా సరే అందులో పూర్ణా ను తప్పకుండా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అసలు సినిమాలో కూడా ఆమెను తీసుకోవడంతో పలు అనుమానాలు రేకత్తాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవిబాబును ఇదే విషయంపై ప్రశ్నించగా తనదైన శైలిలో సమాధానం చెప్పి వార్తలకు పులిస్టాప్ పెట్టారు.

పూర్ణ ఒక మంచి యాక్టర్.. డైరెక్టర్ల దగ్గర ఎటువంటి గొప్పలకు, ఈగోలకు పోదు. డైరెక్టర్ చెప్పిన పని కచ్చితంగా చేస్తుంది. ఏదైనా ఒక పాత్ర ఇచ్చామంటే అందులో ఆమె పరకాయ ప్రవేశం చేస్తుంది. ఇక ఇంత గొప్ప నటిని ఎవరు మాత్రం కాదనుకుంటారు. అందుకే నేను దర్శకత్వం వహించే ప్రతి సినిమాలో కూడా పూర్ణకు అవకాశం ఇస్తాను.. తప్పితే మరే దురుద్దేశం లేదు.. అంటూ క్లారిటీ ఇచ్చారు. ఒకరకంగా చెప్పాలి అంటే డైరెక్టర్ కి యాక్టర్ కి మధ్య ఉన్న సంబంధమే మా మధ్య ఉంది అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news