బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన పఠాన్ చిత్రం నేడు రిలీజ్ అయ్యింది. ఇక సినిమా లో సన్నివేశాలు నభూతో నభవిష్యతి అన్న విదంగా ఉన్నాయని టాక్ నడుస్తోంది. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా గ్రాఫిక్స్ వర్క్ ఉంది. ఇక షారుక్ ఖాన్ హాండ్సమ్ గా కనిపిస్తు అదర గట్టాడు. దీపిక పదుకొనె యాక్షన్ తో పాటు అందాలను విపరీతంగా చూపిస్తూ బికినీలతో రెచ్చిపోయింది.
ఆ మధ్య కాలంలో ఈ సినిమా పై విపరీత మైన విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో దీపికా పదుకొనె కాషాయ రంగు బికినీ ఫొటో వైరల్ గా మారింది. దీనితో అక్కడ నుంచి నార్త్ లో ఆడియెన్స్ మరియు అధికార పార్టీ బీజేపీ వారు ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చెయ్యాలని పిలుపునిచ్చారు. దీనితో ఇది ఈరోజుకి కూడా ట్రెండ్ అవుతూ పెరుగుతూ పోయింది.. కాని ఇప్పుడు అవన్నీ పటా పంచలు అయినట్లు తెలుస్తోంది.
షారుక్ ఖాన్ తెలివిగా తన సినిమా లో దేశభక్తి అంశాన్ని ఎంచుకున్నాడు. దీనితో షారుక్ ఖాన్ పై విమర్శల తో విరుచుకు పడాలని చూసిన వారికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. దానితో వారి నోర్లు హోల్ సేల్ గా మూగబోయాయి. ఇప్పుడు వారి పరిస్తితి మింగ లేక కక్కలేక అన్నట్లుగా మారిపోయింది. అలాగే షారుక్ ఖాన్ ఈ సినిమా ఓపెనింగ్స్ తోనే దుమ్ము దులిపేలా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా విజయం షారుక్ ఖాన్ తో పాటు మిగిలిన బాలీవుడ్ మొత్తానికి అత్యవసరం .