ఐక్యమత్యమే మహాబలం అంటారు. కానీ అది చెప్పే కొందరు మనుషుల దగ్గర మాత్రం ఉండదు. ఐక్యంగా ఉంటే ఎన్నో సాధించవచ్చు అన్న విషయం అందరికీ తెలుసు. ఐక్యంగా ఉంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటారు. వాస్తవానికి మనుషులు జంతులవుల నుండి చాలా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మునుషుల కన్నా అవే ఎంతో తెలివిగా, ఐక్యమత్యంగా ప్రవర్తిస్తుంటాయి. అయితే చీమలు ఈ విషయాన్ని నిరూపించాయి.
ఈ క్రమంలోనే కొన్ని చీమలు ఒకవైపు నుండి మరో వైపుకు దాటడానికి వంతెన నర్మించి మిగిలిన చీమలకు సహాయం చేశాయి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విడియోలో ఐక్యంగా ఉండే ఏదైనా సాధించవచ్చు అన్న రీతిలో ఉంటుంది. చీమలు ఎంతో చాకచక్యంతో, ఐక్యంగా వంతెన నిర్మించి మిగిలిన చీమలకు సహాయం చేయడాన్ని నెటిజన్లు మెచ్చుకుని వాటిని చూసి మనుషులు నేర్చుకోవాలని అంటున్నారు.
అదే విధంగా కొన్నిసార్లు అతి పెద్ద పాఠాలు చిన్న విషయాల ద్వారా తెలుస్తాయని అంటున్నారు. వాస్తవానికి ఒక దేశం గానీ, సమాజం గానీ, కటుంబం గానీ, ఊరు గానీ.. ఐక్యమత్యంగా ఉంటేనే బలంగా ఉంటాయి. ఐక్యమత్యం లోపించింది ఏదైనా అంతరించిపోతుంది. కాలగతిలో కనుమరుగైపోతుంది అన్న దానికి ఈ చీమల ఐక్యత మంచి ఉదాహరణగా నిలుస్తుంది.
#TeamEffort
United we stand! pic.twitter.com/V78EczZuo8— Swati Lakra IPS (@IGWomenSafety) September 13, 2019