మరోసారి తెరపైకి “షోయబ్ మాలిక్ – సానియా మీర్జా”ల విడాకులు !

-

తమ దేశాలకు వివిధ స్పోర్ట్స్ లలో ప్రాతినిధ్యం వహిస్తూ ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిలో పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ అయిన షోయబ్ మాలిక్ మరియు ఇండియాకు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాల జంట ఒక్కటి. పెళ్లి అయిన తర్వాత వీరిద్దరి అపురూపమైన ప్రేమకు గుర్తుగా ఒక బాబు కూడా జన్మించాడు. అయితే కొంతకాలంగా వీరిద్దరికీ మనస్పర్థలు వచ్చాయన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, ఇక త్వరలోనే విడాకులు తీసుకుంటారన్న మాటలు కూడా వినిపించాయి. కానీ ఎలాగో ఈ విడాకుల విషయం సర్దుమణిగింది.. కానీ తాజాగా మరోసారి ఈ విషయం అభిమానులను వేధిస్తూ ఉంది అని చెప్పాలి. దీనికి కారణం షోయబ్ మాలిక్ తన ఇంస్టా గ్రామ్ ఖాతాలో బయో లో మార్పులు చేయడమే.. ఇంతకు ముందు వరకు “సూపర్ వుమన్ సానియా మీర్జాకు భర్త, ప్రేమకు ప్రతిరూపమైన ఒకరికి తండ్రి” అని ఉండేది.. కానీ ఇప్పుడు అది కాస్తా “ఓ బిడ్డకు తండ్రి” అని పెట్టారు.

దీనితో అభిమానుల్లో మళ్ళీ షోయబ్ మాలిక్ సానియా మీర్జాలు విడాకుల గురించి ఆలోచిస్తున్నారా అని టాక్ మొదలైంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పితే కానీ తెలియదు.

Read more RELATED
Recommended to you

Latest news