రాఠీ రచయిత్రి అయిన శోభా దేశ్ పాండే బంగారు ఆభరణాల షాపు ముందు 20గంటలు ధర్నా చేసిన వైనం అందరినీ ఆసక్తి కలిగించింది. షాపు యజమాని మరాఠీలో మాట్లడడానికి నిరాకరించినందుకు గానూ అక్కడే నిలబడి 20గంటలు ధర్నా చేసింది. ఈ సంఘటన దక్షిణ ముంబైలో జరిగింది. చెవికమ్మలు కొనడానికి షాపుకెళ్ళిన రచయిత్రి మరాఠీలో మాట్లాడుతుంటే షాపు యజమాని హిందీలో మాట్లాడుతున్నాడట.
షాపు యజమానిని మరాఠీలో మాట్లాడమని కోరిన శోభా దేశ్ పాండేకి, నాకు మరాఠీ రాదు, హిందీనే వచ్చు అని సమాధానం చెప్పి, ఆమెని బయటకి వెళ్ళొపొమ్మని చెప్పాడట. దాంతో షాపు ముందే 20గంటలు ధర్నా చేసింది. చివరికి తరువాతి రోజు సాయంత్రం తప్పు జరిగిందంటూ క్షమాపణలు కోరుకున్నాడట. గురువారం జరిగిన ఈ సంఘటనని మరాఠీ మీడియా హైలైట్ చేసింది. శోభా దేశ్ పాండే చెప్పిన ప్రకారం, షాపు యజమానికి మరాఠీ వచ్చు. అయినా కూడా కావాలనే హిందీలో మాట్లాడుతున్నాడని పేర్కొంది.