Shock for HDFC customers use UPI services: HDFC కస్టమర్లకు షాక్ తగిలింది. HDFC మొబైల్, ఇంటర్నెట్, బ్యాంకింగ్ సేవలు పనిచేయడం లేదు. ఫోన్ పే, గూగుల్ పే, తదితర యూపీఐ ఫ్లాట్ ఫామ్స్ నుంచి డబ్బులు పంపేందుకు ఆ బ్యాంక్ కస్టమర్లు విపరీతంగా ఇబ్బందులు పడుతున్నారు. టెక్నికల్ సమస్యల కారణంగా ఈ ప్రాబ్లమ్ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.

దీనిపై ఇప్పటి వరకు HDFC బ్యాంక్ రియాక్ట్ అవడం లేదు. చాలామంది ప్రజలు బ్యాంకింగ్ సేవలు పని చేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను వెంటనే సరి చేయాలని ప్రజలు కోరుతున్నారు. నేటి కాలంలో చాలామంది ఫోన్ పే, గూగుల్ పే లను ఎక్కువగా వాడుతున్నారు. ఒక్క రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు ఫోన్ పేని ఉపయోగిస్తున్నారు.