రోహిత్ బ్యాట్స్‌మన్‌గానే కాక.. మంచి కెప్టెన్‌గా కూడా జట్టును ముందుకు నడిపిస్తాడని, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో 2023 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని టీమిండియాకు కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంపిక చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే డిమాండ్ వినిపిస్తోంది.
ఐసీసీ వరల్డ్ కప్ 2019లో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ దారుణంగా ఓటమి పాలయ్యాక.. పెద్ద ఎత్తున టీంపై విమర్శలు వస్తున్న విషయం విదితమే. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లితోపాటు కోచ్ రవిశాస్త్రి, సెలెక్టర్లపై ఫ్యాన్స్, మాజీలు మండిపడుతున్నారు. టీం సెలెక్షన్ సరిగ్గా లేకపోవడంతోపాటు మ్యాచ్ సందర్భంగా కెప్టెన్, కోచ్, టీం మేనేజ్‌మెంట్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, రాయుడును ఎంపిక చేయకపోవడం, ధోనీని 7వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం.. వంటి అనేక కారణాల వల్ల భారత్ న్యూజిలాండ్ చేతిలో ఓడిందని అందరూ పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. అయితే చాలా మంది మాత్రం.. వన్డేలు, టీ20లకు కోహ్లిని తప్పించి బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మను కెప్టెన్‌ను చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీలో భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. టోర్నీలోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ నిలిచాడు. అయితే రోహిత్ బ్యాట్స్‌మన్‌గానే కాక.. మంచి కెప్టెన్‌గా కూడా జట్టును ముందుకు నడిపిస్తాడని, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో 2023 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని టీమిండియాకు కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంపిక చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే డిమాండ్ వినిపిస్తోంది.
రోహిత్ శర్మకు వన్డేలు, టీ20 కెప్టెన్సీని అప్పగించడానికి ఇదే సరైన సమయమని మాజీలు కూడా అభిప్రాయపడుతున్నారు. కోహ్లి కెప్టెన్‌గా ఇప్పటి వరకు అనేక సిరీస్‌లలో రాణించినా.. ప్రస్తుతం జట్టు ఉన్న స్థితిలో కెప్టెన్‌ను మార్చాల్సిందేనని పలువురు అంటున్నారు. వచ్చే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించాలని, అందులో భాగంగానే ముందుగా కెప్టెన్ ఎంపిక జరగాలని, ఆ తరువాత టీం లోటుపాట్లపై దృష్టి సారించి.. అన్ని విభాగాల్లోనూ భారత జట్టును బలంగా తయారు చేయాలని మాజీలు అంటున్నారు. టీమిండియాకు సారథిగా రోహిత్ శర్మ చక్కగా సరిపోతాడని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆగస్టులో ప్రారంభం కానున్న వెస్టిండీస్ టూర్‌కు టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంపిక చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. మరి బీసీసీఐ ఈ విషయంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూస్తే తెలుస్తుంది..!