బాలయ్య ఫాన్స్ కి షాక్…! నాకు బాలయ్య ఎం చేయలేదు…!

-

తమ హీరో ఏదైనా చేస్తే చాలు అభిమానులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. చిన్న విషయానికి కూడా పెద్ద సినిమా చేసి చూపించడం ఫాన్స్ కి వెన్నతో పెట్టిన విద్య. సిని నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సాధారణంగా సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. తాజాగా ఆయనకు సంబంధించి ఒక వార్త బయటకు వచ్చింది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పోషించిన విజయ్ కుమార్‌‌ కు,

నందమూరి బాలకృష్ణ సాయం చేసారని, క్యాన్సర్‌తో బాధపడుతోన్న విజయ్ కుమార్ భార్యకు బసవతారకం హాస్పిటల్‌లో ఉచితంగా చికిత్స అందిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. దీనిపై విజయ్ కుమార్ స్పందించారు. తన భార్యకు రొమ్ము క్యాన్సర్ వచ్చిన విషయం వాస్తవమేనని వైద్యం ఎలా చేయించాలి అని వాకబు చేసినప్పుడు ఏలూరులోని తన స్నేహితులు అక్కడి ఆశ్రమ హాస్పిటల్‌లో చేర్పించారని చెప్పిన ఆయన,

అక్కడ చికిత్స చేయించిన తరవాత హైదరాబాద్‌లోని బసవతారకం హాస్పిటల్ ప్రసిద్ధి కాబట్టి కీమో థెరపీ చేయించడానికి ఇక్కడికి తీసుకొచ్చామని, ప్రస్తుతం కీమో థెరపీ జరుగుతోందని అన్నారు. ఈ విషయం గురించి ఇప్పటి వరకు తనకు, తన స్నేహితులకు తప్ప ఎవ్వరికీ తెలీదని.. అలాంటిది ఈ వార్తలు ఎందుకు పుట్టుకొచ్చాయో అర్థంకావడంలేదని చెప్పిన ఆయన,

తాను స్వతహాగా ఎన్టీఆర్ అభిమానిని అని, రంగస్థలంపై ఆయన వేషాలే వేసి కీర్తి గడించానని చెప్పుకొచ్చారు. తాను చిన్న వయసులో ఎన్టీఆర్‌ను కలిశానని, కానీ బాలకృష్ణను ఒక్కసారి కూడా కలవలేదన్నారు. ఎన్టీఆర్ కుమారుడిగా బాలకృష్ణ అంటే తనకు చాలా అభిమానమని వివరించారు. ఒకవేళ తాను సహాయం అడిగివుంటే ఆయన చేసేవారేమోనని ఆశాభావం వ్యక్తం చేసారు. దీనితో బాలయ్య ఫాన్స్ కి షాక్ తగిలింది.

Read more RELATED
Recommended to you

Latest news