శ్మశానాలకు వెళ్లడం, అంత్యక్రియల్లో పాల్గొనడం, శవాలతో సెల్ఫీలు అంటే ఆమెకు ఇష్టమట..!

-

మీ హాబీస్‌ ఏంటి అంటే మీరేం చెప్తారు..? పాటలు, ఆటలు, షాపింగ్‌, గార్డెనింగ్‌, ట్రావెలింగ్‌, డ్యాన్స్‌ ఇలా ఏవో కామన్‌గా ఉండేవే చెప్తాం కదా..! ఇవేవి కావంటే తిని పడుకోవడం కూడా ఉంటుంది.. కానీ శ్మశానాలకు వెళ్లడం, అంత్యక్రియల్లో పాల్గొనడం, శవాలతో సెల్ఫీలు తీసుకోవడం ఎవరికైనా హాబీగా ఉంటుందా..? ఉంటుందా ఏంటి ఉందండి.. అది కూడా అమ్మాయికి.. ముములగా అమ్మాయిలంటే.. వీటిన్నింటికి భయపడతారు.. కానీ ఆమె మాత్రం వీటినే హాబీగా చేసుకుంది..!
బ్రిటన్‌కు చెందిన ఓ మహిళకు మాత్రం విచిత్రమైన హాబీ ఉంది. ఆమెకు చావులు, అంత్యక్రియలు అంటే చాలా ఇష్టమట. ఎక్కడ అంత్యక్రియలు జరిగినా.. అక్కడికి వెళ్లేందుకు తాను ప్రయత్నిస్తుంటానంటూ చెబుతుంది. అయితే ఆ మహిళ ఇప్పటి వరకు 200కు పైగా అంత్యక్రియలకు హాజరవడం గమనార్హం. సమాధులను చూస్తే తనకు ఆర్ట్‌ గ్యాలరీల్లా కనిపిస్తాయని చెబుతుంది. లండన్‌లోని ఇస్లింగ్టన్‌ ప్రాంతానికి చెందిన జీన్‌ ట్రెండ్‌హిల్‌ తనకు చిన్నతనం నుంచే ఈ విషయంపై ఇంట్రెస్ట్ పెరిగిందని చెబుతోంది.. ఆమె ఏం చెప్తుందో ఆమె మాటల్లోనే…
“చావులు, అంత్యక్రియలపై చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉంది. గతంలో బంధువులు, మిత్రుల అంత్యక్రియలకు వెళ్లేదాన్ని. కొన్నేళ్లుగా తెలియని వారి అంత్యక్రియలకూ వెళ్తున్నాను. తరచూ శ్మశానవాటికలకు వెళ్తాను. అనాథలు, స్నేహితులు లేని వ్యక్తుల శవాలేమైనా వస్తే వాటి దహన సంస్కారాలకు నన్నే పిలుస్తుంటారు. బంధువులెవరూ రాని అపరిచితుల అంత్యక్రియలకు వెళ్లడమంటే నాకు గర్వంగా అనిపిస్తుంది.”
అంత్యక్రియలకూ వెళ్లే ఆసక్తి తనకు చిన్నప్పటి నుంచే ఉందని ట్రెండ్ హిల్ చెబుతున్నారు. సమాధులు మధ్య గడుపుతూ దిగిన ఫొటోలను ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తూ ఉంటారు. ఆమె14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తల్లి చనిపోయింది. 20 ఏళ్ల తరుణంలో తండ్రి కన్నుమూశాడు. ఒకవేళ తల్లిదండ్రుల మరణం వల్ల ఆమె ఇలా తయారైందా అనేది తెలియదు. ఆమె ఇష్టం, సంతోషం అనే చెప్పింది కానీ.. ఎలా ఏర్పడింది, ఏంటి అనే వివరాలను పూర్తిగా చెప్పలేదు.! అందులో ఆమె ఏం అనుభూతి పొందుతుంది..? ఏ యాంగిల్‌లో ఇలా ఇష్టపడుతుంది అనే వివరాలు కూడా చెప్పి ఉంటే మనకు ఇంట్రస్టింగా ఉండేది.!!

Read more RELATED
Recommended to you

Latest news