మునుగోడు ఉపఎన్నిక సెమీఫైనల్ అని..ఈ ఎన్నికలో గెలిస్తే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటవచ్చు అని అన్నీ పార్టీలు భావిస్తున్న విషయం తెలిసిందే. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఒకవేళ కేసీఆర్ ఇంకా ముందుగానే ఆలోచిస్తే…ముందస్తు ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉంది. కానీ రెగ్యులర్ టైమ్ మాత్రం వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు జరుగుతాయి.
ఇక ఆ ఎన్నికలు ముందు జరుగుతున్న మునుగోడు ఉపఎన్నిక..తెలంగాణలో లాస్ట్ ఎన్నిక అని చర్చ నడుస్తోంది. అందుకే మునుగోడు ఉపఎన్నికని సెమీఫైనల్‌గా అందరూ భావిస్తున్నారు. ఈ ఎన్నికలో గెలవడానికి ప్రధాన పార్టీలు తమ శక్తివంచన లేకుండా కష్టపడుతున్నాయి. అయితే ఇక్కడ బీజేపీ ఊహిచని స్కెచ్‌తో ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. అంటే మైండ్ గేమ్‌లో భాగంగా టీఆర్ఎస్‌ని ఇరుకున పెట్టాలని ప్రకటనలు చేస్తున్నారా? లేక నిజంగా ఏదైనా స్కెచ్ ఉందా? అనేది తెలియదు గాని..ఈ మునుగోడు ఉపఎన్నిక సెమీఫైనల్ కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా అన్నారు.
మరి ఇందులో ఎంత అర్ధం ఉందో అర్ధం చేసుకోవచ్చు. అంటే మరో ఉపఎన్నికకు కూడా బీజేపీ ప్లాన్ చేస్తుందని అనుకోవచ్చు. అలాగే మైండ్ గేమ్ ఆడుతూ టీఆర్ఎస్‌ని టెన్షన్ పెట్టే ఉద్దేశం కావొచ్చు. అయితే ఇప్పుడు కిషన్ రెడ్డి మాటలు బట్టి చూస్తే..ఇంకో ఉపఎన్నిక వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. బీజేపీ ఆపరేషన్‌లో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఎవరోకొకరు మళ్ళీ కాషాయ కండువా కప్పుకోవచ్చు.
అయితే ప్రస్తుతం మీడియాలో వస్తున్న కథనాలు బట్టి చూస్తే..గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీలోకి రావడానికి సిద్ధమయ్యారని, మునుగోడు ఉపఎన్నిక ముగియగానే..టీఆర్ఎస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. కానీ ఈ ప్రచారం నిజమవ్వాలంటే మునుగోడులో బీజేపీ గెలిచి తీరాలి. అప్పుడే ఎవరైనా బీజేపీ వైపు చూస్తారు..ఒకవేళ ఓడిపోతే ఇంకో ఎమ్మెల్యే రాజీనామా చేసి బీజేపీలోకి వచ్చి ఉపఎన్నికని ఫేస్ చేసే సాహసం చేయరు. ఇక ఏదైనా మునుగోడు ఉపఎన్నిక రిజల్ట్ బట్టే ఉంటుంది.