షాకింగ్; ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచిన కంపెనీ…!

-

ఉద్యోగ భద్రత లేక చేస్తున్న ఉద్యోగం ఉంటుందో, లేదో, జీతాలు సరిగా వస్తాయో లేదో అని ప్రతి క్షణం ఎప్పుడు ఏ వార్త వినాలో అని కొందరు ఉద్యోగులు భయపడుతుంటే, ఒక కంపెనీ మాత్రం తమ ఉద్యోగులకు జీతాలు పెంచింది. కరోనా పరిస్థితుల కారణంగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న ఈ సమయంలో ఫ్రెంచ్ ఐటీ దిగ్గజం క్యాప్ జెమినీ జీతాలు పెంచుతున్నట్టు ప్రకటించింది.

భారతదేశంలో తమ కంపెనీలో పనిచేస్తున్న 70 శాతం ఉద్యోగులకు 2020 ఏప్రిల్ 1 నుంచి పెరిగిన జీతాలు అందుతాయనే శుభ వార్త చెప్పింది క్యాప్ జెమినీ. ఇండియాలో క్యాప్ జెమినీలో మొత్తం 1,20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు, దానిలో 84,000 మంది ఉద్యోగుల జీతాలు పెరిగాయి. మిగతా ఉద్యోగులకు సైతం జూలైలో జీతాలు పెరగనున్నాయి. జీతాలు పెంచడం తో క్యాప్‌ జెమినీ ఉద్యోగుల్లో సంతోషానికి అవధుల్లేవు.

అంతే కాకుండా ప్రస్తుత లాక్‌డౌన్ కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ఉద్యోగులకు రూ.10,000 క్యాష్ అలవెన్స్ కూడా ప్రకటించింది క్యాప్ జెమినీ. మార్చి రెండో వారంలోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికి, విషయం బయటకు తెలిసే సరికి కాస్త ఆలస్యం అయింది. కేవలం ప్రాజెక్టుల్లో పనిచేసే వారికి మాత్రమే కాకుండా బెంచ్ ఉద్యోగులకు కూడా ఈ కంపెనీ జీతాలను అందిస్తుంది.

వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు షిఫ్ట్ అలవెన్స్ కూడా ఇస్తుంది క్యాప్ జెమినీ. మొత్తం ఉద్యోగులలో 95% మందికి ఇది వర్తిస్తుంది. జూలై 1 నుండి ఇవి అమలు అవుతాయని ప్రకటించింది. అంతే కాకుండా ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన ప్రమోషన్లను జూన్‌లో ప్రకటించనున్నట్లు తెలియజేసింది క్యాప్ జెమినీ కంపెనీ.

Read more RELATED
Recommended to you

Latest news