ఫ్రంట్ పెడతా అన్నాడు.. 4 రాష్ట్రాల ఎన్నికల గెలుపుతో కేసీఆర్ సైలెంట్ అయ్యాడు: డీకే అరుణ

-

ఫ్రంట్ పెడతా అన్నాడు. 4 రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితాలు బీజేపీ గెలుపుతో కేసీఆర్ నోట పడిపోయిందని అన్నారు బీజేపీ జాతీయఉపాధ్యక్షురాలు డీకే అరుణ. అంతకుముందు దేశం మొత్తం తిరుగుతూ.. ఫ్రంట్ పెడతా అన్నాడని..4 రాష్ట్రాల్లో గెలుపుతో భయపడి సైలెంట్ అయ్యారని విమర్శించారు. అసెంబ్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పితే అంతా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కి బీజేపీని చూస్తే వణుకు పుడుతుందని ఆమె విమర్శించారు. కేసీఆర్ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తారనే విశ్వాసం కోల్పోయారని ఆరోపించారు.

dk aruna
dk aruna

ప్రజల్ని మోసం చేసేందుకే ఈ బడ్జెట్ అని… ఏ పథకమైనా సరే అందులో అవినీతి బయట పెడుతారనే భయంతో అసెంబ్లీ నుంచి బయటకు పంపించారని ఆరోపించారు. కేసీఆర్ కి రాజ్యాంగం అంటే గౌరవం లేదని.. కనీసం గవర్నర్ ప్రసంగాన్ని పెట్టలేదని అన్నారు. కేసీఆర్ ని ఫామ్ హౌజ్ కు పంపించాలని పిలుపునిచ్చారు డీకే అరుణ. బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని… హుజూరాబాద్ లో కోట్లు కుమ్మరించినా ఈటెలకే జనం పట్టం కట్టారని అన్నారు. గవర్నర్ ఒక మహిళ.. ఆమెను గౌరవించడం కూడా తెలియని నీకు మహిళా బంధు అనిపెడితే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news