అమెరికా దేశంలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. వాషింగ్టన్ డీసీలో సోమవారం ఉదయం కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక యువకుడు మృతి చెందగా.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

గల్ జమ్ము డీ అనే ట్విట్టర్ అకౌంట్‌లో ఘటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. పూర్తి వివరాల ప్రకారం.. వైట్‌హౌస్‌కు రెండు మైళ్లదూరంలో ఉన్న వాషింగ్టన్ డీసీలోని 14వ యూస్ట్రీట్ నార్త్ వెస్ట్‌లో సంగీత కచేరీ జరుగుతోంది. ఈ కార్యక్రమంలోనే కొందరు దుండగులు కాల్పులు జరిగాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు పరుగులు తీశారు. ఈ మేరకు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Multiple people, including a police officer, were shot at a music event on U Street Northwest in #Washington, DC, just less than 2 miles from the White House. pic.twitter.com/Vw0penv4jj
— Gal Jammu Di (@GalJammuDi) June 20, 2022
ఆ ప్రాంతాన్ని మొత్తంగా పోలీసులు చుట్టుముట్టారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. కాగా, మే 24వ తేదీన టెక్సాస్‌లోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్‌లో జరిగిన కాల్పుల్లో 19 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.