పాన్ కార్డు ఉందా..? ఈ తప్పులు మాత్రం చెయ్యద్దు.. రూ.10,000 జరిమానా..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్ల లో పాన్ కార్డు కూడా ఒకటి. పాన్ కార్డు వలన ఎన్నో లాభాలు వున్నాయి. పాన్ కార్డు తీసుకుంటున్నవారు ట్రాన్సాక్షన్ల కోసం పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ని ఉపయోగిస్తూ వుంటారు. పైగా పాన్ కార్డు ఎన్నో వాటికి అవసరం అవుతుంది. బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చెయ్యడానికి కానీ లోన్స్ కోసం కానీ లేదంటే ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా ఉండాలి. పేరు, ఫోటో, పుట్టిన తేదీ, పాన్ నెంబర్ ఇవన్నీ కూడా మన పాన్ కార్డు పైన ఉంటాయి. ఒక్కొక్కరి పాన్ నెంబర్ ఒక్కోటి ఉంటుంది. ఏ రెండు పాన్ కార్డుల పైనా ఒకే నెంబర్ ఉండదు. అయితే పాన్ కార్డు ఎంతో ముఖ్యమైన డాక్యుమెంట్ కనుక అనేక మంది పాన్ కార్డ్ తీసుకుంటున్నారు.

పన్ను చెల్లించాల్సిన ఆదాయం ఉన్నవారు తప్పనిసరిగా పాన్ కార్డ్ తీసుకోవాల్సిందే. లేదంటే జరిమానా తప్పదు. ఇదిలా ఉంటే కొందరు మాత్రం పాన్ కార్డు విషయంలో తప్పులని చేస్తున్నారు. రెండు పాన్ కార్డులు తీసుకుంటారు. ఈ తప్పు చేస్తే మాత్రం భారీగా జరిమానా చెల్లించాలి. ఒకవేళ ఏ వ్యక్తికైనా రెండు పాన్ కార్డ్స్ ఉంటే ఏం చేయాలి..? ఉండచ్చా ఈ విషయాలు కూడా చూసేద్దాం… ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డ్‌లను ఎవరూ కలిగి వుండకూడదు. ఆదాయపు పన్ను శాఖ నియమనిబంధనల ప్రకారం ఒక్కటే ఉండాలి.

ఎక్కువ పాన్ కార్డ్‌ లు ఉంటే ఆదాయపు పన్ను చట్టం యొక్క ఉల్లంఘనగా పరిగణించబడుతుంది కనుక చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాలి. జరిమానాలు చెల్లించాలి. ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డ్‌లను కలిగి ఉన్నట్లు కనుక తెలిసిందంటే వారిపై ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 272B కింద విచారణ ప్రారంభిస్తుంది. రూ.10,000 జరిమానా విధించవచ్చు. కాబట్టి వేరు వేరు నెంబర్ల తో రెండు పాన్ కార్డ్స్ వుండకూడదు. ఒక నెంబర్ తో రెండు ఉండచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news