లాక్ డౌన్ పెంచాల్సిందేనా…?

-

ఇప్పుడు దేశ వ్యాప్తగా లాక్ డౌన్ పెంచాల్సిందేనా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఇప్పుడు కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల్లో దాదాపు 60 కరోనా కేసులు బయటపడటం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కంగారు పెట్టే అంశం. ఇప్పుడు దీన్ని ఏ విధంగా కట్టడి చెయ్యాలో అర్ధం కాని పరిస్థితుల్లో ప్రపంచం ఉంది అనేది వాస్తవం. మన కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఎదుర్కొలేకపోతుంది.

కరోనా వైరస్ ఇప్పుడు మన దేశానికి సవాల్ విసురుతుంది. ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారికి కరోనా వైరస్ బయటపడటం తో ఇప్పుడు దేశం మొత్తం ఆందోళనకు గురవుతుంది. దక్షిణాది రాష్ట్రాలతో పాటుగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా కేసులు బయటపడటానికి వాళ్ళే కారణం, మార్చ్ మొదటి, రెండో వారాల్లో వాళ్ళు మత ప్రార్ధనలకు వెళ్లి ఆ తర్వాత తిరిగి తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు.

ఇప్పుడు వారి నుంచి కరోనా కేసులు బయటకు వస్తున్నాయి. వాళ్ళను ఆస్పత్రులకు రమ్మని ప్రభుత్వాలు కోరుతున్నా సరే వాళ్ళు మాత్రం బయటకు రావడం లేదు. దీనితో వాళ్ళ నుంచి కరోనా మరికొందరికి సోకే అవకాశాలు ఉన్నాయి అనే ఆందోళన వ్యక్తమవుతుంది. కాబట్టి లాక్ డౌన్ ని మరికొన్ని రోజులు పెంచాలి అని పలు రాష్ట్రాలు కూడా కేంద్రాన్ని కోరే అవకాశాలు కనపడుతున్నాయి. మరి దీనిపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news