మంచి నీళ్లు తాగేటప్పుడు కూర్చిని తాగాలా..? నించుని తాగాలా..?

-

ఆరోగ్యం బాగుండడానికి ఎలా అయితే డైట్ వ్యాయామం అవసరమో అలానే నీళ్లు కూడా అవసరం. శరీరానికి సరిపడా నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతీ ఒక్కరు కూడా శరీరానికి సరిపడా నీళ్ళని తాగుతూ ఉండాలి. లేదంటే అనారోగ్య సమస్యలు సంభవించే ఛాన్స్ వుంది. అయితే చాలా మంది నీళ్లను తాగేటప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు నీళ్లు తాగేటప్పుడు వివిధ సమస్యలు, వివిధ రకాల తప్పులు చేయడం వల్ల కలుగుతూ ఉంటాయి.

అయితే ఆ తప్పులు చేయకుండా ఉండాలంటే దీనిని కచ్చితంగా చూడాల్సిందే ఎప్పుడూ కూడా నీళ్ళని పాలని నిలబడి తాకకూడదు. దీని వలన ఇబ్బంది వస్తుంది. కూర్చుని నీళ్లు తాగితే నాడీ వ్యవస్థ కండరాలు కూడా రిలాక్స్ గా ఉంటాయి. జీర్ణక్రియకు బాగా ఇది సహాయ పడుతుంది. కూర్చుని నీళ్లు తాగితే కిడ్నీలు ఈజీగా ఫిల్టర్ అవుతాయి. నిలబడి నీరు తాగడం వల్ల దుష్పరిణామాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలానే నిలబడి నీళ్లు తాగితే ఎముకల లోని క్యాల్షియం కూడా తగ్గి పోతుంది.

గుండె లో మంట అల్సర్ వంటి ఇబ్బందులు కూడా వస్తాయి. నిలబడి నీళ్లు తాగితే కడుపు లోని ఆమ్లం పెరిగిపోతుంది. జీర్ణ క్రియ సమస్యలు కూడా కలుగవచ్చు. కీళ్లలో ద్రవం కూడా చేరుకుంటుంది దాని వలన కీళ్ల నొప్పులు వంటి ఇబ్బందులు కూడా వస్తాయి జీర్ణ వ్యవస్థ పై నెగిటివ్ ప్రభావం పడుతుంది. కనుక మంచి నీళ్లు తాగేటప్పుడు కూర్చిని తాగండి తప్ప నిలబడద్దు.

Read more RELATED
Recommended to you

Latest news