బీజేపీకి ఎవ్వరూ దొరకనట్టు బండి సంజయ్ నే ఎందుకు కేంద్రమంత్రిని చేశారో వారికే తెలియాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ రావు విమర్శించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. దయచేసి బండి సంజయ్ ని త్వరగా ఎవరికైనా చూపిస్తే అందరికీ మంచిది అన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి దేశభక్తులు, దేశ ద్రోహులు కూడా ఎవరో తెలియదని ఇలాంటి వాళ్లను ఎంపీలుగా చేసి కేంద్ర ప్రభుత్వం ఎవ్వరినీ ఉద్దరించాలని అనుకుంటుందో అర్థం కావడం లేదన్నారు.
బీజేపీ అధ్యక్ష పదవీ కోసమే పోటీ పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని.. త్వరగా ఆ పదవీ ఎవ్వరికో ఒకరికీ ఇస్తే వీళ్ల నోర్లు మూతపడుతాయని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. సన్నబియ్యం అనే క్రెడిబిలిటీ అనేది కాంగ్రెస్ దక్కుతుందని అద్దంకి స్పష్టం చేశారు. దేశం మొత్తం మీద పేదలకు సన్నబియ్యం ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. దేశంలో ఆహారభద్రత పథకాన్ని తెచ్చింది కూడా కాంగ్రెస్ ఘనతే అని తెలిపారు.