ఈ సర్దార్ బ్రదర్స్ ఐడియా అదుర్స్.. సూటు బూటుతో రోడ్డు పక్కన చాట్ బండి

-

కరోనా మహమ్మారి ఎందరో జీవితాలను అతలాకుతలం చేసింది. కొందరు ఆత్మీయులను కోల్పోయి రోడ్డున పడితే.. మరికొందరు ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. ఇంకొందరు ఇదంతా తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే ఓ ఇద్దరు సోదరులు మాత్రం కరోనా మిగిల్చిన చీకటిని చీల్చుతూ తమ జీవితాల్లోకి వెలుగును ఆహ్వానించారు. హోటల్ మేనేజ్​మెంట్ చేసి ఫైవ్ స్టార్ హోటళ్లో పనిచేస్తున్న వారు కొవిడ్ వల్ల ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. అయినా ఆత్మస్థైర్యం కోల్పోలేదు. ఓ వినూత్న ఐడియాతో జీవనాధారాన్ని ఏర్పరుచుకుని అందరి మన్ననలు పొందుతున్నారు ఈ పంజాబీ బ్రదర్స్. మరి వారి స్టోరీ ఏంటో తెలుసుకుందామా..?

పంజాబ్​లోని మొహాలీ రోడ్డులో సర్దార్ బ్రదర్స్ చాట్ బండిని చూసిన వారెవ్వరైనా వావ్ అనాల్సిందే. చాట్ బండిలో వింతేముంది అనుకుంటున్నారా. ఉందండీ. ఇందులో వింతేం ఉంది అనుకుంటున్నారా. ఉందండి. ఈ సర్దార్ బ్రదర్స్ సూటు బూటు ధరించి చాట్ బండి నడుపుతున్నారు. అచ్చం ఫైవ్​స్టార్ హోటళ్లో వెయిటర్స్​లా కస్టమర్లకు సర్వ్ చేస్తున్నారు. ఆహారం మాత్రమే కాదు ఈ సింగ్ బ్రదర్స్ తయారు చేసే చాట్​ కూడా భలే టేస్టీగా ఉంటుంది. ఐ లవ్ పంజాబ్ పేరిట నడుపుతున్న ఈ బండి గురించి తెలుసుకున్న హ్యారీ ఉప్పల్ అనే యూట్యూబర్ తన ఛానెల్​లో వీరి స్టోరీని టెలికాస్ట్ చేశారు.

రోడ్ సైడ్ చాట్ బండి పెట్టుకుని వీళ్లు సూటు బూటు ఎందుకు ధరించారని అనుకుంటున్నారా. ఎందుకంటే వీరు హోటల్ మేనేజ్​మెంట్​లో డిగ్రీ చేశారు. ఫైవ్​స్టార్ హోటళ్లలో ఎలాగైతే డిగ్నిఫైడ్ వెయిటర్స్ ఉంటారో.. చాట్ బండి వద్ద కూడా తాము అలాగే ఉండాలనుకున్నారు. ఫైవ్ స్టార్ హోటళ్లలో కస్టమర్లను ఎలా ట్రీట్ చేసి.. సర్వింగ్ చేస్తారో రోడ్ సైడ్ చాట్ బండి వద్ద కూడా అలాగే కస్టమర్లను ట్రీట్ చేయాలనుకున్నారు. అందుకే ఈ సూటు బూటు. ఇది తాము చేస్తున్న పనిపై తమకు ఎంత గౌరవం ఉందో తెలియజేస్తుందంటున్నారు ఈ సర్దార్ బ్రదర్స్.

ఐ లవ్ పంజాబ్ చాట్ బండి వద్ద మరి ఏమేం తినొచ్చంటే. చాట్, పాప్రీ చాట్, గోల్ గప్పా, దహీ భల్లా వంటి ఎన్నో వెరైటీ టేస్టీ చాట్​ను ఈ సర్దార్ బ్రదర్స్ కస్టమర్లకు అందిస్తున్నారు. ఈ చాట్ తయారీలో వాడే మసాలా, పాపడ్, రసం, గ్రీన్ చట్నీ, నెయ్యి, పెరుగు అన్నింటిని వీళ్లే స్వయంగా తయారు చేస్తారు. జనరల్​గా రోడ్ సైడ్ చాట్ అంటే అనారోగ్యకరంగా భావిస్తాం కానీ ఈ సర్దార్ బ్రదర్స్ తయారు చేసే చాట్ మాత్రం హెల్దీయే. ఎందుకంటే వాళ్లు తయారు చేసే చాట్ డిషెస్​లో ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తారు. అందుకే వీరి చాట్ అంటే పంజాబీలకు ఎంతో ఫేవరెట్.

హోటల్ మేనేజ్​మెంట్​ చేసిన వీళ్లు ఇలా రోడ్డు పక్కన చాట్ బండార్ పెట్టడం వారి కుటుంబాలకు ఏమాత్రం ఇష్టం లేదట. అయినా వారు డబ్బు పొదుపు చేసుకుని ఆ సేవింగ్స్​తో ఈ బండిని ఏర్పాటు చేశారు. త్వరలోనే ఈ బండిని షాప్​గా మార్చనున్నారట. ప్రస్తుతం ఆ పనిలోనే బిజీగా ఉన్నారు ఈ సర్దార్ బ్రదర్స్.

యూట్యూబ్​లో వీరి వీడియో చూసిన నెటిజన్లు ఈ సర్దార్ బ్రదర్స్ చాట్ బండికి ఫిదా అవుతున్నారు. ఈ చెఫ్‌లు భవిష్యత్తులో మిలీనియర్లు అవుతారని అంటున్నారు. ‘‘వారు ఆ సూట్ ధరించడం వల్ల మరింత ప్రొఫెషనల్‌గా కనిపిస్తున్నారు. అవకాశాల్లేవని ఆందోళన చెందే యువత.. వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలి’’ అని కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news