ఓ ఫేక్ వీడియో తో తెలుగుదేశం పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. ఓ బీసీ ఎంపీ అయిన తనని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు అమెరికా నుంచి దొంగ సర్టిఫికెట్ తెప్పించుకున్నారని ధ్వజమెత్తారు. అది ఫేక్ వీడియో అని ఒప్పుకొని చంద్రబాబు ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. నా వీడియో నిజమని నిరూపిస్తే రాజీనామా లేఖను ముఖం మీద విసిరేస్తానని.. చివరకు గెలిచేది నేనే అని అన్నారు గోరంట్ల మాధవ్.
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు అని.. ఓటుకు నోటు వీడియో మీద చంద్రబాబు ప్రమాణం చేస్తారా? నేను కాణిపాకం వినాయకుడి దగ్గర ప్రమాణం చేస్తా దమ్ముంటే నా సవాల్ ని స్వీకరించేందుకు చంద్రబాబు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. టిడిపిలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలు ఒక్కసారి ఆలోచించాలని కోరారు.