Silver Price Update : వ‌రుస‌గా 5వ‌ రోజు పెరిగిన వెండి ధ‌ర‌లు

-

వెండి ధ‌ర‌లు సామాన్య ప్ర‌జ‌ల‌కు చుక్క‌లు చూపెడుతున్నాయి. వ‌రుస‌గా 5 రోజుల పాటు వెండి ధ‌ర‌లు పెరుగుత‌న్నాయి. దీంతో కిలో గ్రాము వెండి ధ‌ర ఆకాశాన్ని తాకుతుంది. ఈ నెల న‌వంబ‌ర్ 10 నుంచి వ‌రుస‌గా నేటి వ‌ర‌కు వెండి ధ‌ర‌లు పెరుగుతూనే ఉన్నాయి. వ‌రుస‌గా ప్ర‌తి కిలో గ్రాము కు రూ. 200 , రూ, 1300, రూ. 800 , రూ. 300 తో పాటు ఈ రోజు కూడా రూ . 300 పెరిగింది. దీంతో ఈ 5 రోజు ల‌లో నే కిలో గ్రాము వెండి పై దాదాపు రూ. 3000 పెరిగింది.

దీంతో సామాన్య ప్రజ‌లు వెండి కొనుగోలు చేయాలంటేనే జంకుతున్నారు. కాగ ప్ర‌స్తుతం పెళ్లిల సిజ‌న్ కావ‌డం తో పెరిగిన ధ‌ర‌ల తో వెండి ని కోనుగోలు చేయ‌డం క‌ష్టం గా మారింది. అయితే కొంత మంది మాత్రం వెండి ధ‌ర‌లు ఎంత పెరిగినా.. కొనుగోలు చేయ‌డానికి ముందుకు వ‌స్తున్నారు. అయితే పెరిగిన ధ‌ర‌ల‌తో దేశ వ్యాప్తంగా ఉన్న ప్ర‌ధాన నగ‌రాల్లో వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని అయిన హైద‌రాబాద్ న‌గ‌రంలో కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 71,700 కు చేరింది.

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో ని విజ‌య‌వాడ న‌గ‌రంలో కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 71,700 కు చేరింది.

అలాగే మ‌న దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలో కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 67,200 కు చేరింది.

దేశ ఆర్థిక రాజ‌ధాని అయిన ముంబై న‌గ‌రంలో కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 67,200 కు చేరింది.

కోల్ క‌త్త న‌గ‌రంలో కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 67,200 కు చేరింది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 67,200 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news