సాధారణ సైనస్ సమస్యకు చెక్ పెట్టే 5 చిట్కాలు మీకోసం..!

-

సైనస్ ఇన్ఫెక్షన్లతో అనేక మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ శీతాకాలంలో సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే చాలా వరకు ఇలాంటి ఇన్ఫెక్షన్లు యాంటీబయాటిక్స్ వాడకుండానే తగ్గిపోతుంటాయి. సైనసిటిస్ అనేది మీ బుగ్గలు, నుదిటి వెనుక, ముక్కుకు ఇరువైపులా వచ్చే వాపు. ఇది గొంతు నుంచి పొట్ట వరకు పోయే ప్రవాహాన్ని ఆపుతుంది. వైరస్, బ్యాక్టీరియా వల్ల కూడా ఇది వ్యాపించవచ్చు. అలర్జీలు, నాసల్ పోలిప్స్ వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇంటి చిట్కాలతో దీన్ని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

అసలు సైనస్ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఎలా ఉంటాయి

సైనస్ ప్రభావంతో నుదురు, కళ్లు, ముక్కు, బుగ్గల చుట్టూ విపరీతమైన నొప్పి ఉంటుంది. రుచి సరిగ్గా తెలియకపోవడం లాంటి తీవ్రమైన లక్షణాలు కూడా ఉండవచ్చు. కొన్నిసార్లు జ్వరం వస్తుంది. కంటి వాపు, వికారం, వాంతులు ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి.

లక్షణాలు తీవ్రంగా లేకుంటే ఈ నివారణ చిట్కాలను పాటించవచ్చు

1. వెచ్చని వస్త్రంతో మర్దన

సైనస్ లక్షణాలు ఉన్నవారు ముక్కు, బుగ్గలు, కళ్లపై ఆవిరి పట్టిన టవల్ లేదా క్లాత్‌తో మర్దన చేయోచ్చు.. దీనివల్ల నాసిక రంధ్రాలు తెరచుకొని శ్లేష్మం వదులుతుంది. అవసరాన్ని బట్టి ఈ పద్ధతిని అనుసరిస్తూ ఉండొచ్చు.

2. ఆవిరి పట్టడం

ఆవిరి పట్టడం ద్వారా నాసికా భాగాలు తెరచుకుంటాయి. నొప్పి, ఒత్తిడిని తగ్గించడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. పసుపు, తులసి, యూకలిప్టస్, మరికొన్ని మూలికలను నీటిలో మరిగించి ఆవిరిపట్టవచ్చు. అయితే అదేపనిగా పట్టకూడదు. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఎక్కువసార్లు ఆవిరిపడితే ఊపిరితిత్తులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.

3. నెట్ పాట్

ముక్కు రంధ్రాలు శుభ్రం కోసుకోవడానికి నెట్ పాట్ బాగా ఉపయోగపడుతుంది. శ్లేష్మం, దుమ్ము, పుప్పొడి, ఇతర వ్యర్థాలను నెట్ పాట్ తొలగిస్తుంది. ప్రతి రోజూ నాసికా రంధ్రాలను శుభ్రం చేసుకునే ఈ పద్ధతి ఆవిరి పట్టడం కంటే సమర్థంగా పనిచేస్తుందని నిపుణులు వెల్లడించారు. దీర్ఘకాల సైనస్ సమస్య ఉన్నవారు ఆరు నెలల పాటు ఈ విధానాన్ని పాటిస్తే మార్పు ఉంటుందట.

4. హ్యూమిడిప్లైయర్ వాడకం

హ్యూమిడిప్లైయర్ గాలిలో తేమను పెంచుతుంది. మంటను తగ్గించడానికి, ముక్కు రంధ్రాలు తెరుచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. హ్యూమిడిప్లైయర్ సమర్థంగా పనిచేయాలంటే వీలైనంత దగ్గరగా పెట్టుకోవాలి. ఊపిరితిత్తుల్లో వైరస్, బ్యాక్టీరియాలను హ్యూమిడిప్లైయర్ నిరోధిస్తుంది. అయితే దీన్ని వినియోగించేవారు తయారీదారుల సూచనలను తప్పనిసరిగా పాటించండి.

5. నీరు

సైనస్ బాధితులు తరచుగా నీరు తాగడం వల్ల శ్లేష్మం తొలగిపోతుందని వైద్య నిపుణులు అంటున్నారు. కొద్ది మొత్తంలో ఎక్కువ సార్లు నీరు తాగుతూ సైనస్ నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఈ పద్ధతుల్లో మీకు సులువుగా ఉన్నది ఏదైనా సరే ట్రై చేసి చూడండి. లక్షణాలు తీవ్రత పెరిగితే వైద్యులను తప్పక సంప్రదించగలరు.
– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news