బంగారం ధరలు ప్రతి రోజు వినియోగ దారులకు షాక్ ఇస్తున్నాయి. వరుసగా ప్రతి రోజు ధరలు పెరుగుతున్నాయి. తాజా గా రోజు కూడా బంగారం ధరలు మళ్లి పెరిగాయి. గత నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వరుసగా పెరుగుతున్న బంగారం ధరల వల్ల 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్ నగరంలో ఇప్పటి కే రూ.50,000 మార్క్ అందుకుంది. అయితే ఈ మధ్య కాలంలో పెళ్లి సిజన్ కావడం తో బంగారం వినియోగం విపరీతం గా పెరిగింది.
దీంతో ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. హైదారాబాద్, విజయవాడ, కోల్ కత్త తో పాటు బెంగళూర్ వంటి నగరాలలో బంగారం ధరలు పెరిగాయి. మన దేశ రాజధాని ఢిల్లీ నగరం లో మాత్రం బంగారం ధరలు స్థిరంగా ఉంది. అయితే మన దేశ వ్యాప్తం గా ఉన్న కొన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
మన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,100 కు పెరిగింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,180 కు చేరింది.
ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,100 కు పెరిగింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,180 కు చేరింది.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,050 కు పెరిగింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,420 కు చేరింది.
దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,280 కు పెరిగింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,280 కు చేరింది.
కోల్ కత్త నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,550 కు పెరిగింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,250 కు చేరింది.
బెంగళూర్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,100 కు పెరిగింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,180 కు చేరింది.