20కేజీల వెయిట్‌ తగ్గిన యంగ్ హీరో…!

లాక్‌డౌన్‌ టైంలో చాలామంది హీరోయిన్స్‌ వెయిట్‌ తగ్గారు. లావుగా కనిపించే కమెడియన్‌ విద్యుల్లేఖ ఎంచక్కా తగ్గి పెళ్లి కూడా చేసుకుంది. బొద్దుగా వుండే అనుపమ పరమేశ్వరన్‌ గుర్తుపట్టలేనంతగా సన్నబడింది. కరోనా టైంలో ముద్దుగుమ్మలు వెయిట్‌ తగ్గడంపై ఎక్కువ కాన్సన్‌ట్రేషన్ చేయగా.. ఓ యంగ్‌ హీరో 20కేజీలు వెయిట్‌ లాస్ అయ్యాడు. కెరీర్‌ మొదట్లో ఎలా కనిపించాడో.. మళ్లీ ఆ స్టేజ్‌కి వచ్చేశాడు.

సీజన్‌ బట్టి ప్రేమలో పడుతూ కోలీవుడ్‌ లవర్‌బాయ్‌ అనిపించుకున్నాడు శింబు. నయనతార.. హన్సిక.. త్రిషతో ప్రేమాయణం నడిపాడు. కెరీర్‌ మొదట్లో వరుస హిట్స్ కొట్టినా.. పదేళ్ల నుంచి సరైన హిట్‌ పడలేదు. శింబు పనైపోయిందన్న విమర్శలు గుప్పుమన్నాయి. వరుస లవ్‌ ఫెయిల్యూర్స్‌ కారణమో… సక్సెస్‌ లేదన్న బాధేమోగానీ.. శింబు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఎఫెక్ట్‌ ఫిజిక్‌పై పడి… వెయిట్‌ ఓవర్‌గా పెరిగిపోయాడు ఈ బ్యాచులర్‌.

లాక్‌డౌన్‌ టైంలో శింబులో పట్టుదల పెరిగి…. ఎవరూ ఊహించని విధంగా వెయిట్‌ లాస్‌ అయ్యాడు. 20 కేజీలు తగ్గివుంటాడని అంచనా. రీసెంట్‌గా షేర్‌ చేసిన ఫొటోలు చూస్తుంటే.. గడ్డం తప్ప మనిషి కనిపించడం లేదు. ఇన్నేళ్లుగా పెరుగుతూ వచ్చి… ఒక్కసారిగా మేకోవర్‌ అయ్యాడు. ప్రస్తుతం నటిస్తున్న ఈశ్వరుడు మూవీలో కూడా సన్నగానే వున్నాడు శింబు. మొత్తానికి తమ హీరోను చూసిన ఫ్యాన్స్ మాత్రం… డిప్రెషన్‌ నుంచి బైటపడ్డాడని.. ఎలా వుండాలనుకున్నామో.. ప్రస్తుతం అలాగే వున్నాడంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచులర్‌ ప్రేమ జోలికి పోకుండా వుంటాడో లేదో చూడాలి.