మా టీవి ఛానల్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 గొడవలు,లవ్ స్టోరీలతో ఇంట్రెస్టింగ్ గా సాగిపోతోంది. హౌస్ లో ఒక్కొరు ఒక్కోరకంగా ప్రవర్తిస్తున్నారు. నిన్న ఆదివారం నాడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన చలాకి చంటి హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. ఆయన కంటే వీక్ గా వున్న వాళ్ళు చాలా మంది వున్నారు కదా, మరి చంటినే ఎందుకు పంపారు అనేది అర్థం కాని విషయం. అసలు బిగ్ బాస్ ఏమి చూపిస్తాడో అలాగే ఆడియన్స్ ఏమి చూసి ఓట్లు వేస్తారో అనేది దేవుడికే తెలియాలి.
ఇప్పుడు తాజా పరిస్థితి తీసుకుంటే సింగర్ రేవంత్ బిహేవియర్ అర్ధం కాకుండా వుంది. తాను మరో కంటెస్టెంట్ అయిన వాసంతి మైకం లో పడుతున్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే గీతు వాసంతిని రేవంత్ ఇష్టపడుతున్నట్లు ఈ ఆదివారం ఎపిసోడ్ లో చెప్పింది. వాస్తవంగా రేవంత్ వాసంతి పట్ల మంచిగానే ఉంటున్నాడు. ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకుంటూ వుంటున్నారు. ఆమె చిన్న చిన్న తప్పులు చేసినా కూడా లైట్ తీసుకుంటున్నాడు. చూస్తూంటే ఇద్దరి మధ్య మాంచి ర్యాపో ఏర్పడింది.ఇది చూసి గీతు రేవంత్ కు వాసంతి అంటే ఇష్టమనే సీక్రెట్ ను బట్టబయలు చేసింది.
ప్రస్తుతం రేవంత్ భార్య గర్భవతిగా ఉంది. రేవంత్ బిగ్ బాస్ హౌస్ లొకి వెళ్ళేటప్పుడు వచ్చి కన్నీళ్ళతో వీడ్కోలు పలికింది. వెళ్ళేటప్పుడు ఇద్దరూ బాగా ఎమోషనల్ అయ్యారు. కొన్ని రోజుల క్రితం తన సీమంతం కూడా జరిగింది.ఈ పరిస్తితులలో గీతూ ఈ విషయం బయట పెట్టింది. ఇది రేవంత్ భార్యను కచ్చితంగా ఇబ్బంది పెడుతుంది. రేవంత్-వాసంతిల మధ్య నిజంగా అలా జరుగుతుందో లేదొ కాని గలాటా గీతూ మాత్రం బాంబు పేల్చింది.ఇది నిజమేనా లేదంటే ప్రాంక్ గా గీతు అలా అబద్దం చెప్పిందా అని ప్రేక్షకులు జుట్టు పీక్కుంటున్నారు. కొంత మంది మాత్రం పెళ్ళై పెళ్ళాం కడుపుతో వుంటే, పెళ్లి కాని అమ్మాయితో ఈ పాడు పనులు ఏంటి అని రేవంత్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు.