సింగర్ సునీత సంచలన నిర్ణయం..నటిగా ఎంట్రీ !

-

సింగర్‌ సునీత.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన మధురమైన గాత్రంలో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంటారు. అలా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇటీవలే రెండో పెళ్లి చేసుకొని తన వివాహ జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఆమె… కెరీర్​లో ఇప్పటివరకు దాదాపు 120 మంది హీరోయిన్స్​కు డబ్బింగ్ చెప్పారు. అయితే, సింగర్‌ సునీత టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ఓ వార్త వైరల్‌ గా మారింది.

SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రంలో కీ రోల్ కోసం దర్శకుడు త్రివిక్రమ్ సునీతను సంప్రదించారట. పాత్ర నచ్చడంతో ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం దునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. అయితే ఈ సినిమాలో సునీత, మహేష్ కు అక్కగా నటించనుందని వినికిడి.

Read more RELATED
Recommended to you

Latest news