బ్రేకింగ్: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి క‌న్నుమూత‌

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో తీరని విషాదం నెలకొంది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి చెందారు. న్యూమోనియా వ్యాధి కారణంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి చెందారు.

ఇవాళ ఉదయం నుంచి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందికి లోనైనా సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇవాళ సాయంత్రం మృతి చెందారు. సాయంత్రం నాలుగు గంటల 16 నిమిషాల సమయంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించినట్లు సమాచారం అందుతోంది.

ఇక సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి వార్త విన్న… టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా సీతారామ శాస్త్రి… 1955 మే 20 వ తేదీన జన్మించారు. ఆయన స్వస్థలం అనకాపల్లి. పదవ తరగతి వరకు ఆయన విద్యాభ్యాసం అనకాపల్లి లోనే సాగింది. కాకినాడలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ చేశారు. ఆ తరువాత… చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు సిరివెన్నెల సీతారామశాస్త్రి.కాగా ఈనెల 24వ తేదీన న్యూమోనియా వ్యాధి కారణంగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో సిరివెన్నెల సీతారామశాస్త్రి చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news