టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ప్రధాన నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై ఆరోపణలు చేస్తున్న వారికీ నోటీసులు జారీ చేస్తోంది. ఇందులో భాగంగా రేవంత్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. పేపర్ లీకేజీ ఘటనపై తాను చేసిన ఆరోపణలకు సంబంధించి తన వద్ద ఉన్న వివరాలు అందచేయాలంటూ కోరింది.
గ్రూప్-1లో కొందరికి 100కు పైగా ర్యాకులు వచ్చాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఒక మండలంలో 100 మందికి పైగా మంచి ర్యాంకులు వచ్చినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి రేవంత్‌రెడ్డి వద్ద ఉన్న వివరాలు అందజేయాలని సిట్ నోటీసులు జారీచేసింది. మరికొంత మందికి నోటీసులు ఇచ్చే ఆలోచం చేస్తున్నట్లు సమాచారం.
మరోవైపు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సిట్.. విశ్వసనీయ సమాచారం ప్రకారం 100కు పైగా మార్కులు సాధించిన గ్రూప్-1 అభ్యర్థుల జాబితా రూపొందించి వారిలో అనుమానితులను విచారించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.