బీఆర్ఎస్‌లో టెన్షన్ టెన్షన్..కవితని విచారిస్తున్న ఈడీ!

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితని ఈడీ విచారణ చేస్తుంది. మార్చి 11న ఒకసారి విచారణ చేయగా, నేడు మరోసారి విచారణ చేస్తున్నారు. ఇప్పటికే మూడు గంటల పాటు కవిత విచారణ కొనసాగుతూ వస్తుంది. సాయంత్రం 6 గంటల వరకూ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక రామచంద్రపిళ్లైతో కలిపి కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

ఇండో స్పిరిట్‌ సంస్థలో వాటాలపై, ఆప్‌కి ముట్టిన వందకోట్ల ముడుపులపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలిసింది. అలాగే  బ్యాంక్‌ స్టేట్‌మెంట్స్‌, ఇతర డాక్యుమెంట్లపైనా ఈడీ ఆరా తీస్తున్నట్లు సమాచారం. అటు ఢిల్లీ హైకోర్టులో లిక్కర్ స్కామ్ నిందితుడు అభిషేక్ బోయినపల్లికి చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఇక ఈడీ ఆఫీస్‌ పరిసరాల్లో 144 సెక్షన్‌ అమలు అవుతుంది. భారీగా బారికేడ్స్‌ ఏర్పాటు చేశారు.

Kavitha

ఇప్పటికే ఢిల్లీలో మంత్రి కేటీఆర్‌, కవిత భర్త అనిల్‌, ఎంపీ సంతోష్‌, ముఖ్య నేతలు ఉన్నారు. ఇక కవితకు మద్దతుగా ఇంకా కొందరు నేతలు ఢిల్లీకి వెళ్లడానికి రెడీ అయ్యారు. అయితే కవిత ఈడీ విచారణ ఎదురుకుంటున్న నేపథ్యంలో బి‌ఆర్‌ఎస్ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది..ఆమెని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న సందర్భంలో బి‌ఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

కాగా, ఈనెల 11న మొదటిసారి ఈడీ విచారణకు హాజరైన కవిత రెండోసారి ఈ నెల 16న గైర్హాజరైన విషయం తెలిసిందే. న్యాయ నిపుణులతో కూడా చర్చించి నేడు ఈడీ విచారణకు హాజరయ్యారు. చూడాలి మరి కవిత విషయంలో ఈడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.

Read more RELATED
Recommended to you

Latest news