జమ్ముకశ్మీర్‌లో నిన్నటి ప్రమాదం మరవకముందే మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాజౌరి జిల్లాలో ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. పూంఛ్ నుంచి రాజౌరి వైపు వెళ్తున్న సమయంలో జరిగిన ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 25 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు.
గమనించిన స్థానికులు వారిని రక్షించేందుకు ఘటనాస్థలికి చేరుకున్నారు. బస్సు కింద ఇరుక్కున్న వారిని తీసేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్థానికంగా ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు.