బాన్సువాడ పట్టణంలోని SC బాలుర వసతి గృహాన్ని అకస్మీకంగా తనిఖీ చేసారు స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి. ఆహార పదార్థాలను పరిశీలించారు. స్టోర్ రూం లో సరుకులను పరిశీలించి, విద్యార్థులతో కలిసి టిఫిన్ చేసారు. అనంతరం స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. వసతి గృహాలలో లోపాలను సవరించడానికే అకస్మీక తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. హాస్టళ్ల నిర్వాహణకు ప్రభుత్వమే కావలసిన నిధులను మంజూరు చేస్తుందన్నారు.
ప్రభుత్వ వసతి గృహాలలో మెరుగైన వసతులకు, పరిశుభ్రతకు స్పెషల్ డెవలప్మెంట్ నిధులు కెటాయించామన్నారు. ఆహారం వండేటప్పుడు, పిల్లలకు వడ్డిస్తున్న సమయంలో వార్డెన్లు ఖచ్చితంగా హాస్టల్ లో ఉండాలని.. లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాణ్యమైన సరుకులు మాత్రమే వాడాలని.. హాస్టల్ నిర్వాహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని సూచించారు. వసతి గృహంతో పాటుగా, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.