ఆదాయం దాచుకోలేకపోతున్నారా…? చిన్న చిన్న సూచనలు…!

-

ఈ రోజుల్లో ఉద్యోగాల్లో వచ్చే జీతాలు సరిపడక చాలా మంది పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు. 15 వేలు లోపు జీతం ఉన్న చాలా మంది ఈ ఉద్యోగాలకు ఆసక్తి చూపిస్తున్నారు. డేటా ఎంట్రీ చేయడం, చిన్న చిన్న షాపుల్లో జాబులు, చేసే ఉద్యోగంతో పాటు మరో ఉద్యోగం వంటివి చేస్తూ నాలుగు రాళ్ళు వెనకేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇళ్ళకు పంపించడానికి, వాళ్ళ ఖర్చులకి అంటూ ఈ ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే చాలా మంది ఆదా చేసుకోవడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారు అనేది వాస్తవం.

నెల తిరిగే సరికి సంపాదించే రూపాయి అయిపోవడం అప్పుల పాలు అయిపోవడం వంటివి జరుగుతుంది. దీనికి చిన్న చిన్న సలహాలు ఇస్తున్నారు అనుభవం ఉన్న వారు. ఉదాహరణకు మీరు చేసే ఉద్యోగంలో 15 వేలు వస్తున్నాయి, బయట చేసే చిన్న ఉద్యోగంలో 5 వేలు వస్తున్నాయి అనుకోండి… అందులో 20 శాతం లేదా ఒక రెండు వేలు… ఏదైనా బంగారం షాపులో ప్లాన్ తీసుకోండి… నెల నెలా రెండు వేలు కట్టే విధంగా ఏడాది ప్లాన్ తీసుకోండి… ఆ తర్వాత మీ వద్ద ఇంకా ఎక్కువ మొత్తం ఉంటే మాత్రం… వాటికి జోడించి ఏదైనా ఆభరణం కొనుగోలు చేయండి.

మీ రోజు వారి ఖర్చు ఏ విధంగా ఉంటుందో దాన్ని కూడా కట్టాలి అన్నట్టు పెట్టుకోండి. లేదా … మీరు ఆ రెండు వేలు ఒక బ్యాంకు ఖాతా ఓపెన్ చేసి దానిలో వేయండి… ఆ బ్యాంకు కి సంబంధించిన ఎటిఎం కార్డు తీసుకోవద్దు… ఆన్లైన్ బ్యాంకింగ్ గాని ఏదీ పెట్టుకోవద్దు. ఏదైనా బ్యాంకు లో వ్యక్తిగత ఋణం తీసుకుని… ఆ ఋణంతో ఒక బంగారం వస్తువు కొనుగోలు చేయండి… నెల నెలా రెండు వేలు కడుతూ ఆ లోన్ తీర్చేయండి… ఇప్పుడు పోస్టాఫీస్ వంటివి… ఆదాయాన్ని దాచుకోవడానికి సరికొత్త ప్లాన్ లు అందిస్తున్నాయి.

నెలకు ఇంత కట్టుకోండి అని చెప్తున్నాయి. అవి చాలా నమ్మకమైన ప్లాన్స్… లేదా చిట్ లు కూడా వేసుకోవచ్చు. నమ్మకంగా ఉన్న వాళ్ళ దగ్గర చిట్ వేసుకుని నెలకు ఇంత అని కట్టుకున్నా సరే డబ్బులు ఆదా అవుతాయి. డబ్బు అనేది నేటి రోజుల్లో చాలా అవసరం… అవసరమైనప్పుడు మనని ఆదుకునే వాడు ఎవడూ ఉండడు… కష్టాల్లో కబుర్లు చెప్పే వాళ్ళే గాని చేతి సాయం చేసే దిక్కు ఉండదు మనకి… కాబట్టి మీ ఆర్ధిక జీవనం విషయంలో మీరే జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే భవిష్యత్తు ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news