పడవలో పాము.. భయంతో ప్రయాణికుల కుదుపు.. నీటిలో మునిగి ఆరుగురు మృతి

-

వరద బాధితులతో వెళ్తున్న ఓ పడవలో పాము కనిపించింది. భయంతో అందులో ఉన్నవాళ్లు కదిలారు. వారి కుదుపుతో అదుపు తప్పి పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. ఈ ప్రమాదం ఉత్తరప్రదేశ్ గాజీపుర్​లో జరిగింది.

అఠ్​హఠా గ్రామం సమీపంలో వరద బాధితులతో వెళ్తున్న పడవలో ఓ పాము కనిపించింది. దీనితో జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కొందరు భయంతో నీటిలో దూకారు. ఇదే సమయంలో వారి కుదుపులకు అదుపు తప్పిన పడవ బోల్తాపడింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మరణించారు. మరో 10 మందిని రక్షించారు. ఒక బాలిక కోసం గాలిస్తున్నారు.

బుధవారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా.. మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుకుంటూ వచ్చింది. అఠ్​హఠా గ్రామం.. కొన్నిరోజులుగా పడుతున్న వర్షాల కారణంగా ముంపునకు గురైంది. ఆ గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అధికారులు ఓ డీజల్​ బోటును పంపారు. బోట్​ బయలుదేరిన సమయంలో అందులో మొత్తం 17 మంది ఉన్నారు. ఇదే సమయంలో పాము కలకలం సృష్టించగా.. పడవ మునిగిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news